India Alliance Comment : ఇండియా కూటమి సమర శంఖం
అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు
India Alliance Comment : ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి ఎన్నికల శంఖారావం పూరించింది. పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 28 పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు కూడా చేరబోతున్నాయి ఇండియా కూటమిలో. ముంబై వేదికగా జరిగిన కీలక భేటీలో సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో కొలువు తీరిన మోదీ , భారతీయ జనతా పార్టీ(BJP) సంకీర్ణ సర్కార్ ను ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను డెడ్ లైన్ కూడా విధించింది. ఈ లోపు సెప్టెంబర్ 30 వరకు అభ్యర్థుల ఉమ్మడి ఎంపిక కొలిక్కి రావాలని స్పష్టం చేసింది. ఇది కీలకమైన మార్పు అని చెప్పక తప్పదు.
India Alliance Comment Viral
దేశ వ్యాప్తంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చింది ఇండియా కూటమి. ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించింది. ఇండియా కూటమికి పునాది వేసింది తొలుత బీహార్ సీఎం నితీశ్ కుమార్. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. కీలక భూమిక పోషించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi), టీఎంసీ చీఫ్ , బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జేఎంయూ చీఫ్ , సీఎం హేమంత్ సోరేన్, ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత్ మాన్ , మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా , అఖిలేష్ యాదవ్ , ఉద్దవ్ ఠాక్రే , ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ , శివసేన జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ హాజరయ్యారు.
ఇండియా కూటమి కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కూటమి పార్టీల నుంచి ఒక్కరినే అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించింది. ప్రతి ఒక్క పార్టీ దీనికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. దీని వల్ల బీజేపీకి ఒకే ఒక్కరు మాత్రం ఇండియా కూటమి తరపున పోటీ చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి మోదీ సర్కార్ పై సమర శంఖం పూరించాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకించి సోనియా గాంధీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. మొత్తంగా ఇండియా కూటమి ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. మరోసారి పవర్ లోకి రావాలని అనుకుంటున్న మోదీ పరివారానికి ఇప్పుడు ప్రతిపక్షాల కూటమి ఏ మేరకు పోటీ ఇస్తుందో వేచి చూడాలి.
Also Read : R Ravi Kannan : రవి కన్నన్ రామన్ మెగసెసె విన్నర్