IND vs SL 1st Test : అనుకున్నట్టే జరిగింది. భారత క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో 222 రన్స్ తేడాతో గెలుపొందింది. భారత బౌలర్ల ధాటికి లంకేయులు ఏ కోశాన ధీటుగా జవాబు ఇవ్వలేక పోయారు.
174 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ లో కుప్ప కూలిన లంక రెండో ఇన్నింగ్స్(IND vs SL 1st Test) లో మరో నాలుగు పరుగులు జోడించి 178 పరుగులకే చాప చుట్టేసింది. ఇక లంక జట్టులో నిరోషన్ డిక్ వెల్లా ఒక్కడే 51 రన్స్ చేసి సత్తా చాటాడు.
ఆ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ చెరో నాలుగు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. పేసర్ షమీ రెండు వికెట్లు తీశాడు.
ఇక భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కీలక భూమిక పోషించిన రవీంద్ర జడేజా స్టార్ హీరోగా మారాడు ఈ టెస్టు మ్యాచ్ లో . 175 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలవడమే కాక తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు.
ఓవరాల్ గా అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోను మెరిసిన జడ్డూకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదిలా ఉండగా రెండు టెస్టుల సీరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
కాగా రెండో టెస్టు ఈ నెల 12 నుంచి 18 వరకు బెంగళూరు వేదికగా సాగనుంది. ఇక భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 578 పరుగులు చేస్తే లంక ఫస్ట్, రెండో ఇన్నింగ్స్ లలో 174, 178 పరుగులు చేసింది.
Also Read : చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్