IND vs WI : ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన చరిత్ర లిఖించింది భారత క్రికెట్ జట్టు. వన్డే క్రికెట్ ఫార్మాట్ లో అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ 1000వ మ్యాచ్ కావడం విశేషం.
ఇక టీమిండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించాడు. గత ఏడేళ్లుగా భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్న కోహ్లీ తప్పుకోవడంతో ఇక పూర్తి స్థాయిలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు హిట్ మ్యా.న్. గాయం కారణంగా దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్ల లేక పోయాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీమ్(IND vs WI) 176 పరుగులు చేసింది. ఇక 177 టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి విజయం నమోదు చేసింది. ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.
3 వన్డేల సీరీస్ లో భాగంగా 1-0 తో ఆధిక్యంలో ఉంది. ఓపెనర్లు రోహిత్ శరర్మ 60 పరుగులు చేయగా ఇషాన్ కిషన్ 28 పరుగులు చేసి రాణించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 84 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆఖరులో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ 5 ఫోర్లతో 34 పరుగులు చేస్తే దీపక్ హూడా 26 బంతులు ఆడి 32 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో జోసెఫ్ 2 వికెట్లు తీస్తే హుసేన్ ఓ వికెట్ దక్కింది.
రెండో వన్డే ఈనెల 9న జరగనుంది. ఇదిలా ఉండగా భారత రత్న, దిగ్గజ గాయని లతా మంగేష్కర్ మృతికి సంతాప సూచకంగా భారత జట్టు నివాళి అర్పించింది.
ఈ మేరకు భారత ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి ఆటలో పాల్గొన్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా ధ్రువీకరించింది.
Also Read : వెల్ డన్ బాయ్స్ – సౌరవ్ గంగూలీ