India Calls Sri Lanka : తమిళ సమస్యపై భారత్ ఆందోళన
ఐక్య రాజ్య సమితిలో ప్రత్యేక ప్రస్తావన
India Calls Sri Lanka : గత కొన్నేళ్లుగా తమిళ సమస్య కొనసాగుతూ వస్తోంది. ఐక్య రాజ్య సమితి వేదికగా భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమిళులు ఎదుర్కొంటున్న సమస్యను వెంటనే పరిష్కరించేందుకు శ్రీలంక ప్రభుత్వం కృషి చేయాలని కోరింది.
మానవ హక్కులను ప్రోత్సహించడం, రక్షించడం యుఎన్ చార్టర్ సూత్రాలకు కట్టుబడి ఉండాలని సూచించింది. తమిళుల జాతి సమస్యకు రాజకీయ పరిష్కారానికి కట్టుబడి ఉన్న శ్రీలంకలో కొలవదగిన పురోగతి లేక పోవడాన్ని తప్పు పట్టింది.
తీవ్రంగా ఆందొళన వ్యక్తం చేసింది. 13వ సవరణను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు, ప్రావిన్షియల్ హోల్డింగ్ కోసం తక్షణమే విశ్వసనీయ చర్య చేపట్టాలని కోరింది భారత్ శ్రీలంకను(India Calls Sri Lanka) .
సంక్షోభంలో ఉన్న ద్వీప దేశంలో వీలైనంత త్వరగా కౌన్సిల్ ఎన్నికలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలి 51వ సెషన్ లో శ్రీలంకలో సయోధ్య, జవాబుదారీతనం , మానవ హక్కులను ప్రోత్సహించడంపై ఓహెచ్ సీహెచ్ఆర్ నివేదికపై ఇంటరాక్టివ్ డైలాగ్ సందర్భంగా భారత్ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
మానవ హక్కులను గౌరవించడం, ప్రోత్సహించడంలో తమ దేశం ముందంజలో ఉంటుందని పేర్కొంది భారత్. శ్రీలంకలో తమిళులు మైనార్టీ వర్గంగా ఉన్నారు.
వారిపై కొన్ని తరాల నుంచి వేధింపులు కొనసాగుతూ వస్తున్నాయి. దీనినే ప్రత్యేకంగా ప్రస్తావించింది భారత్. శ్రీలంకలో శాంతి, సయోధ్యపై భారత దేశం స్థిరమైన దృక్ఫథాన్ని కలిగి ఉందని స్పష్టం చేసింది.
శ్రీలంకలోని తమిళులకు న్యాయం, శాంతి, సమానత్వం, గౌరవాన్ని నిర్దారిస్తుందన్నారు.
Also Read : ఆటో డ్రైవర్ ఇంట్లో కేజ్రీవాల్ భోజనం