India Crosses 100 Medals : భారత్ ఖాతాలో 100 పతకాలు
ఆసియా గేమ్స్ లో రికార్డ్ బ్రేక్
India Crosses 100 Medals : చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023లో భారత్ చరిత్ర సృష్టించింది. ఏకంగా 100 పతకాలు సాధించింది. ఇది అరుదైన రికార్డ్ కావడం విశేషం. అన్ని రకాల ఈవెంట్స్ లలో భారత్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తమకు ఎదురే లేదని చాటుతున్నారు.
India Crosses 100 Medals Viral
తాజాగా మహిళల కబడ్డీలో చైనీస్ తైపీపై భారత్ గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. దీంతో వంద ఖాతాలు పూర్తయ్యాయి. ఇదిలా ఉండగా 2018లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 70 పతకాలు సాధించింది. కానీ ఈసారి సీన్ పూర్తిగా మార్చేశారు భారతీయ క్రీడాకారులు.
ప్రతి ఈవెంట్ లో తమదైన ప్రతిభతో ఆకట్టుకున్నారు. పతకాలను సాధిస్తూ దేశానికి పేరు తీసుకు వచ్చారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ , కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసియా క్రీడలలో పతకాలు సాధించిన విజేతలను అభినందించారు.
మీరు సాధించిన పతకాలను చూసి యావత్ భారత దేశం గర్విస్తోందని పేర్కొన్నారు నరేంద్ర మోదీ. ఇదిలా ఉండగా ఆసియా క్రీడల్లో తొలిసారిగా 100 పతకాలు సాధించడం(India Crosses 100 Medals) విశేషం. ఉత్కంఠ భరితంగా సాగిన కబడ్డీ ఫైనల్ లో భారత్ చైనాను ఓడించి వందో పతకాన్ని చేరుకుంది. ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన ఈ గెలుపు క్రీడల్లో పెరుగుతున్న శక్తికి సంకేతం.
Also Read : CM KCR Viral : తెలంగాణ తలైవా కేసీఆర్