India Emerges : ఇంటర్నెట్ వినియోగంలో భారత్ టాప్
గ్లోబల్ లీడర్ గా అవతరించిన ఇండియా
India Emerges : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత దేశం అరుదైన ఘనత సాధించింది. డిజిటలైజేషన్ వినియోగంలో ముందంజలో కొనసాగుతోంది. తాజాగా ఇంటర్నెట్ వినియోగం (యాక్సెస్ )లో ఇండియా(India) ఏకంగా గ్లోబల్ లీడర్ గా అవతరించింది. ఇది మోదీ సర్కార్ సాధించిన ఘనత గా పేర్కొంది. విచిత్రం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యధిక వినియోగంలో ముందంజలో ఉండడం విస్తు పోయేలా చేసింది. అతి తక్కువ టారిఫ్ కలిగి ఉండడం కూడా ఇందుకు ప్రధాన కారణం.
ప్రతి జీబీ ధర రూ. 10 కంటే లభించడం తో ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ కలిగి ఉన్నారు. ప్రత్యేకించి 143 కోట్ల భారతీయులలో అత్యధిక జనం మొబైల్ కనెక్టివిటీని కలిగి ఉండేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. ఇవాళ టెక్నాలజీ వినియోగం మరింత పెరిగింది. డిజిటలైజేషన్ ను మోదీ ప్రభుత్వం కావాలని ఫోకస్ చేస్తోంది. గతంలో డబ్బులు కావాలంటే బ్యాంకులకు వెళ్లే వాళ్లు.
కానీ ఇప్పుడంతా మొబైల్ ద్వారా చెల్లింపులు, లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఇక ఇంటర్నెట్ వినియోగం పరంగా చూస్తే భారత్ ఏకంగా నెంబర్ వన్ లో నిలిచింది. మిగతా దేశాలు తర్వాతి స్థానాలలో ఉన్నాయి. ఇవాళ ప్రతి పనికి మొబైల్ కనెక్టివిటీతో ఆధారపడి ఉంది.
ఇదిలా ఉండగా ఇంటర్నెట్ వినియోగంలో భారత్ నెంబర్ వన్ గా నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
Also Read : Pawan Kalyan Wishes : వరుణ్ తేజ్ లావణ్యకు పవన్ విషెస్