Pawan Kalyan Wishes : వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య‌కు ప‌వ‌న్ విషెస్

బొకే ఇచ్చి అభినందించిన ప‌వ‌ర్ స్టార్

Pawan Kalyan Wishes : హైద‌రాబాద్ లోని మ‌నికొండ‌లో కొణిదెల నాగ‌బాబు నివాసంలో శ‌నివారం అత్యంత నిరాడంబ‌రంగా జ‌రిగిందిన నటుడు వ‌ర‌ణ్ తేజ్ , లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం కార్య‌క్ర‌మం. ఒక ఏడాది పాటు ఈ ఇద్ద‌రూ ల‌వ్ లో ప‌డ్డారు. ఆపై చెటా ప‌ట్టాల్ వేసుకుని తిరిగారు. లోక‌మంతా వీరి ప్రేమాయ‌ణం గురించి చెప్పుకుంది. ఇక సోష‌ల్ మీడియాలో వీరు త్వ‌ర‌లోనే ఒక్క‌టి కాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జ‌రిగింది. ఇటీవ‌లే పారిస్ కు వెళుతూ వ‌రుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి కెమెరా క‌ళ్ల‌కు చిక్కారు. చివ‌ర‌కు తామిద్ద‌రం పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

మెగా ఫ్యామిలీలోకి ఎంట‌రైంది న‌టి లావణ్య త్రిపాఠి. ఈసంద‌ర్భంగా సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు ఈ జంట‌ను అభినందించారు. ప్ర‌త్యేకించి మెగా ఫ్యామిలీకి చెందిన కుటుంబీకులు, అత్యంత స‌న్నిహితులు విచ్చేశారు. త‌మ ఇంట జ‌రుగుతున్న వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ , ఉపాస‌న , అల్లు అర్జున్ , అల్లు అర‌వింద్ , సురేఖ హాజ‌ర‌య్యారు.

న‌టుడు వ‌రుణ్ తేజ్ , న‌టి లావ‌ణ్య త్రిపాఠిల నిశ్చితార్థం సంద‌ర్బంగా శుభాకాంక్ష‌లు తెలియ చేశారు. కొణిదెల నాగ బాబు దంప‌తులు , మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంప‌తులతో పాటు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు. ఇదిలా ఉండ‌గా వ‌ర‌ణ్ తేజ్ , లావ‌ణ్య క‌లిసి అంత‌రిక్షం సినిమాలో న‌టించారు. ఇక వ‌రుణ్ తేజ్ న‌టించిన ఫిదా, ఎఫ్‌-2 బిగ్ సక్సెస్ గా నిలిచాయి. మొత్తంగా మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు త్వ‌ర‌లో మోగ‌నున్నాయి.

Also Read : Dasoju Sravan KCR : అప‌ర భ‌గీర‌థుడు కేసీఆర్ – దాసోజు

 

Leave A Reply

Your Email Id will not be published!