Dasoju Sravan KCR : అపర భగీరథుడు కేసీఆర్ – దాసోజు
ఆయన విజన్ అద్భుతం
Dasoju Sravan KCR : భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. శనివారం సీఎం కేసీఆర్ తో కలిసి విమానంలో హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు వెళ్లారు దాసోజు శ్రవణ్.
సీఎంతో కలిసి ప్రయాణం చేయడం ఒక ఉద్విగ్నతను కలిగించిందని పేర్కొన్నారు. ఇద్దరం కలిసి 50 నిమిషాలకు పైగా జర్నీ చేశామని తెలిపారు. ప్రయాణంలో తాము అసలు తెలంగాణ లోనే ఉన్నామా అన్న అనుమానం తనకు కలిగిందని అన్నారు దాసోజు శ్రవణ్(Dasoju Sravan KCR).
ఒకనాడు నీళ్లు లేక నెర్రెలు బోయిన తెలంగాణ ఇదేనా అని నాకు తోచింది. ఇవాళ ఆకు పచ్చని తివాచీలు పరుచుకున్నట్లు పంట పొలాలతో కనిపించిందని , తనకు ఆశ్చర్యం వేసిందన్నారు బీఆర్ఎస్ అగ్ర నేత.
మార్గ మధ్యంలో సజీవంగా పారుగుతున్న వాగులు, వంకలు, నీటి తో నిండిన చెరువులు, చెక్ డ్యాములు కనువిందు చేశాయన్నారు. కొండ పోచమ్మ సాగర్ , రంగనాయక సాగర్ , మల్లన్న సాగర్ , అన్నపూర్ణ బ్యారేజ్ , పార్వతి బ్యారేజ్ , ఎల్లంపల్లి ప్రాజెక్టు, పరుగులు తీస్తున్న గోదావరి నది కళ్లను చెమర్చేలా చేసిందన్నారు డాక్టర్ దాసోజు శ్రవణ్.
Also Read : N Chandra Babu Naidu : ఏపీ మంత్రులపై బాబు సెటైర్లు
