ICC ODI Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్-3లో ఇండియా

మూడు ఫార్మాట్ ల‌లో భార‌త్ భ‌ళా

ICC ODI Rankings : ఇంగ్లండ్ టూర్ భార‌త్ కు బాగా కలిసొచ్చిన‌ట్లుంది. రీ షెడ్యూల్ ఐదో టెస్టు మ్యాచ్ లో ఘోర‌మైన ఓట‌మి త‌ర్వాత టీమిండియా పుంజుకుంది. టి20 సీరీస్ ను 2-1 తేడాతో చేజిక్కించుకుంది.

ఇక జాస్ బ‌ట్ల‌ర్ కొత్త నాయ‌క‌త్వంలో ఇంగ్లండ్ ఆశించిన మేర స‌త్తా చాట లేక పోయింది. మూడో టి20లో టీమిండియాపై గెలిచి ప‌రువు నిలుపుకుంది. కానీ మూడు వ‌న్డేల సీరీస్ లో మొద‌టి వ‌న్డే మ్యాచ్ లో భార‌త బౌల‌ర్ల ధాటికి విల‌విల‌లాడింది.

ఏకంగా వికెట్ న‌ష్ట పోకుండా 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. దీంతో ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్ లో భార‌త జ‌ట్టు మెరుగైన ర్యాంక్ సాధించింది. ఏకంగా మూడో స్థానంకు చేరింది.

ఇదే ప్లేస్ లో ఉన్న దాయాది పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. భార‌త జ‌ట్టుకు 108 పాయింట్లు వ‌చ్చాయి. ఇక పాకిస్తాన్ కంటే 2 పాయింట్లు అధికంగా సాధించి మ‌రో స్థానం ముందుకు వెళ్లింది.

అయితే ఈ ర్యాంకింగ్స్(ICC ODI Rankings) లో న్యూజిలాండ్ స‌త్తా చాటింది. మ‌రోసారి టాప్ పొజిష‌న్ లో నిలిచింది ఆ జ‌ట్టు . 126 పాయింట్లతో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో కొలువుతీరింది.

122 పాయింట్ల‌తో రెండో స్థానంలో కొన‌సాగుతుండ‌గా 101 పాయింట్ల‌తో ఐదో ప్లేస్ లో , 99 పాయింట్లో 6వ స్థానంలో స‌ఫారీ జ‌ట్లు నిలిచాయి.

ఇక 96 పాయింట్ల‌తో బంగ్లా దేశ్ 7వ స్థానంలో 92 పాయింట్ల‌తో 8వ ప్లేస్ లో , 71 పాయింట్ల‌తో విండీస్ 9వ స్థానంలో 69 పాయింట్ల‌తో ఆఫ్గ‌నిస్తాన్ 10వ స్థానంలో నిలిచాయి. 54 పాయింట్ల‌తో ఐర్లాండ్ 11వ స్థానంతో స‌రి పెట్టుకుంది.

Also Read : ఐసీసీ టాప్ 10లో స్మృతి మంధాన

Leave A Reply

Your Email Id will not be published!