Mukesh Ambani : ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక‌ వ్య‌వ‌స్థ‌గా భార‌త్

2047కి సాధిస్తామ‌న్న ముకేశ్ అంబానీ

Mukesh Ambani : రిల‌య‌న్స్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ ముకేశ్ అంబానీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 2047 నాటికి భార‌త దేశం బ‌ల‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదుగుతుంద‌న్నారు. అంతే కాదు ఏకంగా 40 ట్రిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో టాప్ లోకి చేరుకుంటుంద‌ని జోష్యం చెప్పారు. ప్ర‌పంచ స్థాయిలో వ్యాపారాల‌ను నిర్మించ‌డ‌మే త‌మ సంస్థ రిల‌య‌న్స్ ముఖ్య ఉద్దేశ‌మ‌న్నారు. రిల‌యన్స్ ఫ్యామిలీ డే ఫంక్ష‌న్ లో ముకేశ్ అంబానీ(Mukesh Ambani)  ప్ర‌సంగించారు.

మ‌ర్రి చెట్టులా రిల‌య‌న్స్ దిన‌దినాభివృద్ది చెందుతోంద‌న్నారు. దీనికంత‌టికీ మీ అంద‌రి స‌హ‌కారం ఉంద‌న్నారు ముకేశ్ అంబానీ. ఏళ్లు వెళ్లి పోతాయి. ద‌శాబ్దాలు గ‌డిచి పోతాయి. త‌రాలు మారాయి. టెక్నాల‌జీ విస్త‌రించింది. కానీ రిల‌య‌న్స్ అంత‌కంత‌కూ త‌న సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తూ పోతోంద‌ని అన్నారు.

ఇందులో కుటుంబ విలువ‌లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. రిల‌య‌న్స్ అనే వ‌ట‌వృక్షం ఇప్పుడు బ‌లంగా ఉంద‌న్నారు ముకేశ్ అంబానీ.

రోజు రోజుకు భార‌తీయుల జీవితాల‌ను సుసంప‌న్నం చేస్తున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. శ‌క్తివంతం చేయ‌డం, పోషించ‌డం, వారి ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ద వ‌హించ‌డం త‌మ బాధ్య‌త అని పేర్కొన్నారు రిల‌య‌న్స్ సంస్థ‌ల చైర్మ‌న్ , మేనేజింగ్ డైరెక్ట‌ర్. 45 ఏళ్ల కింద‌ట ఈ రిల‌య‌న్స్ అనే వ‌ట వృక్షం ధీరూ భాయ్ అంబానీ నాటార‌ని అది పెద్ద‌ద‌వుతూ వ‌చ్చింద‌న్నారు ముకేశ్ అంబానీ(Mukesh Ambani) .

మా తండ్రి ఒక ఉన్న‌త‌మైన ఆశ‌యంతో రిల‌య‌న్స్ ను స్థాపించారు. ఆయ‌న కొన్నేళ్ల ముందే భ‌విష్య‌త్తు గురించి క‌ల క‌న్నారు. దానిని నిజం చేసేందుకు మేం స్థిరంగా ప్ర‌య‌త్నం చేస్తూ వ‌చ్చామ‌న్నారు ముకేశ్ అంబానీ.

Also Read : రాజీవ్ ఉన్న‌ప్పుడే జర్నీ ప్రారంభం

Leave A Reply

Your Email Id will not be published!