India Cricket Comment : భారత దేశం క్రికెట్ మయం
భావోద్వేగాల సమ్మేళనానికి వేళాయె
India Cricket Comment : ఈ దేశంలో క్రికెట్ అంటే ఓ పండగ. ఓ సంబురం. అంబరాన్ని చుంబించే ఉద్వేగం కూడా. ప్రధానంగా ప్రపంచంలో
ఒకప్పుడు ఇంగ్లండ్ , ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగితే యావత్ ప్రపంచం ఉత్కంఠతతో ఎదురు చూసేది.
కానీ సీన్ మారింది. ఇప్పుడు ఎక్కడా లేనంత పోటీ, ఉద్వేగం , ఉత్కంఠ ఒక్క దాయాదుల మధ్య జరిగే మ్యాచ్ కోసం నెలకొంది. అది పాకిస్తాన్ , భారత జట్లు ఆడితే ఆ మజాయే వేరు.
ఇరు దేశాల మధ్య నెలకొన్న దూరం ఇప్పుడు మ్యాచ్ లపై చూపుతోంది. ఇది పక్కన పెడితే తరాలు మారే కొద్దీ క్రికెట్ లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
కానీ రోజు రోజుకు జనాదరణ మాత్రం పెరుగుతూనే ఉన్నది. బంతికి బ్యాట్ కు మధ్య జరిగే పోరాటంలో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొనడం ఖాయం.
ఎన్నో క్రీడలు ఉన్నాయి. కానీ ఫుట్ బాల్, టెన్నిస్ ను తలదన్నేలా ఇప్పుడు క్రికెట్ దూసుకు వచ్చింది. ఒకప్పుడు క్రికెట్ ను చులకనగా చూసిన
అభివృద్ది చెందిన దేశాలు దాని కోసం తహతహ లాడుతున్నాయి.
ప్రపంచాన్ని శాసిస్తూ వస్తున్న అగ్ర రాజ్యం అమెరికా సైతం ఇప్పుడు క్రికెట్ ను పలవరిస్తోంది. ఇప్పుడు క్రికెట్ ఓ వ్యాపారం. కార్పొరేట్ కల్చర్ ను పుణికి పుచ్చుకుంది.
యావత్ ప్రపంచ మార్కెట్ ను శాసిస్తూ వస్తున్న కంపెనీలు, కరోడ్ పతులు, దిగ్గజ వ్యాపారవేత్తలు, టైకూన్లు ఇలా చెప్పుకుంటూ పోతే సినీ స్టార్స్ సైతం
క్రికెట్ పై ఫోకస్ పెడుతున్నారు.
అది లేకుండా ఉండలేమంటున్నారు. ఒకప్పుడు క్రికెట్ జెంటిల్మన్ గేమ్. కాన నేడు అది దేశాన్ని శాసించే ఆటగా మారి పోయింది. ప్రత్యేకించి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు క్రికెట్ ను ఆడుతున్నాయి.
కానీ భారత దేశంలో అలా కాదు. ఈ దేశంలో క్రికెట్ అంటే పిచ్చి. ప్రేమ. అభిమానం. ఆదరణ. మోహం కూడా. అంతే కాదు క్రికెట్ అంటే ఓ మతం. దీనిని తట్టుకోవడం కష్టం.
భారత దేశం ఆడుతున్న ప్రతి సమయంలోనూ, ప్రతి సందర్భంలోనూ మువ్వొన్నెల భారతీయ త్రివర్ణ పతాకం ఎగరాల్సిందే. అంతలా అల్లుకు పోయింది క్రికెట్ .
యావత్ క్రీడా ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిలిచింది. కేవలం ఐదేళ్ల కాలానికి
నిర్వహించిన బిడ్ లో ఏకంగా 49 వేల కోట్లకు పైగా రావడం అంటే మామూలు విషయం కాదు.
ఇది ఓ రికార్డ్ గా పరిగణించక తప్పదు. ఒకప్పుడు ఫుట్ బాల్ టాప్ లో ఉండేది ఇప్పుడు దానితో క్రికెట్ పోటీ పడుతోంది. ఇది పక్కన పెడితే క్రికెట్ అంటే ఇండియా. ఇండియా అంటే క్రికెట్.
ఇది భారతీయ జీవన విధానంలో ఒక భాగమై పోయింది. ఆగస్టు 27 నుంచి క్రికెట్ పండగ స్టార్ట్ కానుంది. భారత్ , పాకిస్తాన్ జట్లు మూడుసార్లు తలపడ నున్నాయి.
దీని వెనుక మార్కెట్ స్ట్రాటజీ ఉంది. అది పక్కన పెడితే యావత్ ప్రపంచానికి ఓ స్వాంతన కలగనుంది. ఏది ఏమైనా ఇవాళ భారత్ అంటే క్రికెట్ మయం
కదూ అని తప్పని పరిస్థితి నెలకొంది.
Also Read : సూర్యా భాయ్ మోస్ట్ డేంజరస్ క్రికెటర్