AB De Villiers : భారత్..కీవీస్ ఫైనల్ కు ఖాయం – డివిలియర్స్
షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ క్రికెటర్
AB De Villiers : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇక ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇవాళ కీలకమైన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ బలమైన జట్ల మధ్య జరుగుతోంది.
గ్రూప్ -1లో టాప్ లో ఉన్న కేన్ మామ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్టు గ్రూప్ -2లో రెండవ స్థానంలో అనూహ్యంగా దూసుకు వచ్చిన బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు సెమీస్ ఆడనుంది.
ఇరు జట్లు బలంగానే కనిపిస్తున్నా పొట్టి ఫార్మాట్ లో ఎవరు ఎప్పుడు టాప్ లో ఉంటారో చెప్పడం కష్టం. కానీ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు, కేన్ మామ నేతృత్వంలోని న్యూజిలాండ్ జట్లు ఫైనల్ కు వెళతాయమని జోష్యం చెప్పాడు.
అంతే కాదు ఈసారి మెగా టోర్నీ టైటిల్ ను కీవస్ కైవసం చేసుకునే ఛాన్స్ ఉందంటూ పేర్కొన్నాడు. కానీ మ్యాచ్ పరంగా ఎప్పుడు ఏ జట్టు గెలుస్తుందనే విషయం చెప్పలేమన్నాడు డివిలియర్స్(AB De Villiers).
ఇక టోర్నీ విషయానికి వస్తే మొదటి సెమీస్ బుధవారం జరగనుండగా నవంబర్ 10న గురువారం ఇండియా, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా చిరకాల ప్రత్యర్థులైన పాకిస్తాన్, ఇండియా జట్లు ఫైనల్ కు రావాలని కోరుకుంటున్నారు.
ప్రధానంగా వ్యాపారులు, కార్పొరేట్లు, వందలాది కంపెనీలు, వేలాది కోట్ల రూపాయలు ఈ రెండు జట్లు ఆడే మ్యాచ్ పై వేచి చూస్తున్నాయి.
Also Read : పాక్ గెలుస్తుందా కీవీస్ నిలుస్తుందా