BCCI Selection : భారత్ పరాజయం బీసీసీఐపై ఆగ్రహం
జట్టు సెలెక్షన్ పై నెట్టింట్లో ఫ్యాన్స్ ఫైర్
BCCI Selection : భారత జట్టు పరాజయ పరంపర కొనసాగుతూనే ఉంది. వన్డే సీరీస్ లు వరుసగా కోల్పోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తో పాటు ప్రస్తుతం బంగ్లాదేశ్ తోనూ వన్డే సీరీస్ కోల్పోయింది. పేలవమైన ఆట తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది టీమిండియా.
ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నా వారిని పక్కన పెట్టడంపై మండిపడుతున్నారు ఫ్యాన్స్ . ఒక్క మ్యాచ్ లో 36 పరుగులు చేసిన సంజూ శాంసన్ ను కాదని 6 మ్యాచ్ లు ఆడి 29 రన్స్ చేసిన రిషబ్ పంత్ ను ఆడించడాన్ని ఎద్దేవా చేస్తున్నారు. బంగ్లాదేశ్ దెబ్బకు భారత్ జట్టు ఓటమి పాలు కావడంతో తట్టుకోలేక అభిమానులు భగ్గుమంటున్నారు.
ప్రస్తుతం బిసీసీసీఐ ట్రోల్(BCCI Selection) చేస్తున్నారు. భారత ఆటగాళ్లు ఐపీఎల్ పై చూపించినంత శ్రద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ పై ఫోకస్ పెట్టడం లేదని పేర్కొంటున్నారు. అతి విశ్వాసం, 1990 నాటి రాహుల్ ద్రవిడ్ కోచింగ్ , మితి మీరిన రాజకీయాలు , ఆటగాళ్లకు అత్యధిక వేతనాలు , ఆదాయంపై , ప్రకటనలపై ఉన్నంత శ్రద్ద లేక పోవడం జట్టు ఓటమికి కారణాలంటూ పేర్కొంటున్నారు.
అంతేకాదు ఎందుకని సంజూ శాంసన్ ను పక్కన పెట్టారంటూ ప్రశ్నిస్తున్నారు. గత 6 మ్యాచ్ లలో 5 ఇన్నింగ్స్ లు ఆడాడు. మొత్తం 215 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 86. స్ట్రైక్ రేట్ 111.39 గా ఉంది. త్వరలో వరల్డ్ కప్ జరగనుంది. మొత్తంగా దీనికంతటికీ బీసీసీఐ కార్యదర్శి జే షానే కారణమని దుమ్మెత్తి పోస్తున్నారు.
Also Read : బౌలింగ్ వైఫల్యం వల్లే పరాజయం
And change approach drastically. We haven’t won a T20 WC since the IPL started & last 5 years have been poor in ODI’s apart from winning inconsequential bilateral. Haven’t learned from our mistakes for too long and far from being an exciting team in limited overs cricket. CHANGE
— Venkatesh Prasad (@venkateshprasad) December 7, 2022