India-Maldives : కష్టమొస్తే ముందుండి ఆడుకుంటామంటూ అభయమిచ్చిన మోదీ

ఇరుదేశాలు కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకోవడంతో పాటు పలు ఎంఓయూలపై సంతకాలు చేశారు...

India-Maldives : ద్వీప దేశమైన మాల్దీవులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు భారత్ ముందుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మాల్దీవులతో భారత్‌కు ఉన్న స్నేహం దశాబ్దాల నాటిదని గుర్తు చేశారు. భారతదేశంలో ఐదు రోజుల పర్యటన కోసం వచ్చిన మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు తో సోమవారంనాడు జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. నరేంద్ర మోదీ(Narendra Modi), ముయుజ్జులు హైద్రాబాద్ హౌస్ నుంచి పలు ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇరుదేశాలు కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకోవడంతో పాటు పలు ఎంఓయూలపై సంతకాలు చేశారు. మాల్దీవుల్లోని హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేను వర్చువల్‌గా ప్రారంభించడంతో పాటు అధికారికంగా ‘రూపీ కార్డ్ ‘ను ప్రవేశపెట్టారు. మాల్దీవుల్లో కొద్దిరోజుల క్రితం రూపీ కార్డ్‌ను లాంఛ్ చేశామని, యూపీఐ ద్వారా ఇరుదేశాలు అనుసంధానం కావడానికి ఇప్పుడు సమయం వచ్చిందని ప్రధాని తెలిపారు.

India-Maldives PM’s Meet…

మాల్దీవులకు ఎప్పుడు కష్టమొచ్చినా ఆదుకునేందుకు ముందుడే దేశం భారత్ అని సంయుక్త సమావేశంలో మోదీ(Narendra Modi) పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా, మౌలిక సదుపాయల ప్రాజెక్టులకు తాము చేసిన సహాయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మాల్దీవులు అధ్యక్షుడు, ఆయన ప్రతినిధి బృందానికి సాదర స్వాగతం చెబుతున్నానని, ఇరుదేశాల మధ్య సంబంధాలు దశాబ్దాల నాటివని అన్నారు. ఇండియాకు అతి సమీప దేశం, సన్నిహిత స్నేహతుడు మాల్దీవులని, సరిహద్దు దేశాలతో భారత్ విధానంలోనూ, సాగర్ విజన్‌లోనూ మాల్దీవులకు కీలక భూమిక ఉందన్నారు. మాల్దీవులకు ఏ కష్టమొచ్చినా తొలుత స్పందించడంలో భారత్ ఎప్పుడూ కీలకంగా నిలుస్తుందని చెప్పారు. పొరుగుదేశాల పట్ల భారత్ ఎప్పుడూ బాధ్యతాయుతంగా ఉంటుందని, సమగ్ర ఆర్థిక, తీర ప్రాంత భద్రతా భాగస్వా్మ్యం విషయంలో ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం వ్యూహాత్మక దిశలో ముందుకు తీసుకువెళ్లేందుకు ఉభయదేశాలు నిర్ణయించినట్టు చెప్పారు.

పలు ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా మాలే, మాలే ప్రజలకు న్యూఢిల్లీ ఎప్పుడూ చేయూతనిస్తుండటం పట్ల ముయుజ్జు కృతజ్ఞతలు తెలిపారు. మాల్దీవుల అవసరాలకు అనుగుణంగా 400 మిలియన్ డాలర్లు, రూ.300 కోట్ల కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసినట్టు చెప్పారు. తమ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడల్లా భారత్ స్నేహహస్తం అందిస్తూనే ఉందన్నారు. అందుకు తాము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని అన్నారు. మాల్దీవుల్లో సామిజక-ఆర్థిక, మౌలిక వసతుల అభివృద్ధిలో భారత్ కీలక భాగస్వామి అని చెప్పారు. ఏళ్ల తరబడి భారత్ అందిస్తున్న ఉదార సాయం, సహకారానికి గాను ప్రధాని మోదీ, భారత ప్రభుత్వం, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.

Also Read : Amit Shah : సీఎంలతో సమావేశం అనంతరం మావోయిస్టుల పై షా సంచలన వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!