Covid19 India : దేశంలో 3,325 కేసులు 17 మ‌ర‌ణాలు

రోజు రోజుకు పెరుగుతున్న కోర‌నా కేసులు

Covid19 India : దేశంలో క‌రోనా తీవ్ర‌త త‌గ్గు ముఖం ప‌డుతుందని అనుకున్న త‌రుణంలో రోజు రోజుకు కొత్త‌గా కేసులు(Covid19 India) న‌మోద‌వుతుండ‌డం కొంత ఆందోళ‌న క‌లిగిస్తోంది. రోజుకు క‌నీసం 4 వేల‌కు పైగానే కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో కేంద్ర స‌ర్కార్ అప్ర‌మ‌త్తం అయ్యింది. ఈ మేర‌కు దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆధ్వ‌ర్యంలో కీల‌క స‌మీక్ష కూడా చేప‌ట్టింది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది ప్ర‌భుత్వం.

ఇక కేసుల విష‌యానికి వ‌స్తే 24 గంట‌ల్లో కొత్త‌గా 3,325 క‌రోనా కేసులు(Covid19 India) న‌మోద‌య్యాయి. క‌రోనా కార‌ణంగా 17 చావులు సంభ‌వించాయి. దీంతో మ‌ర‌ణాల సంఖ్య 5,31,564కి పెరిగింది. ఇందులో ఏడుగురు కేర‌ళ‌లో చ‌ని పోయారు. మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 4,49,52,996కి చేరుకుంది.

కాగా క్రియాశీల కేసులు 47,246 నుండి 44,175కి త‌గ్గాయి. ఇక ఇన్ఫెక్ష‌న్ల‌లో 0.11 శాతంగా ఉన్నాయి. జాతీయ కోవిడ్ -19 రిక‌వ‌రీ రేటు 98.71 శాతంగా న‌మోదైంద‌ని కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,77,257కి చేరుకోగా మ‌ర‌ణాల రేటు 1.18 శాతంగా న‌మోదైంది. దేవ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ కింద ఇప్ప‌టి దాకా 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చిన‌ట్లు తెలిపింది.

Also Read : వాట్సాప్ షాక్ 47 ల‌క్ష‌ల ఖాతాలు క్లోజ్

Leave A Reply

Your Email Id will not be published!