India Rejects : శ్రీలంకలో చోటు చేసుకున్న సంక్షోభం దృష్యా పెరుగుతున్న నిరసనలు, ఆందోళనలను కట్టడి చేసేందుకు ఆ దేశానికి భారత్ అదనపు దళాలు పంపించిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
దీనిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అంతే కాకుండా ఆ దేశ మాజీ ప్రధాని మహింద రాజపక్స తన కుటుంబీకులతో కలిసి దొడ్డి దారిన ఇండియాకు పారి పోయారంటూ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ గా మారింది.
ఇదంతా అబద్దమని ప్రభుత్వం పేర్కొంది. కొలంబోలోని భారత హై కమిషన్ ఈ మేరకు వాటిని తోసిపుచ్చింది. భారత్ ఇతర దేశాల విషయంలో జోక్యం చేసుకోందని, ప్రతి దేశం బాగుండాలని కోరుకుంటుందని స్పష్టం చేసింది.
శ్రీలంకలో(India Rejects )ప్రజాస్వామ్యం, స్థిరమైన ప్రభుత్వం, ఆర్థిక పునరుద్దరణకు భారత దేశం సంపూర్ణ మద్దతు ఇస్తుందని కుండ బద్దలు కొట్టింది. కొలంబోకు న్యూఢిల్లీ సైన్యాన్ని పంపించ లేదని పేర్కొంది.
ఆర్థిక సంక్షోభం దృష్ట్యా స్వయంగా ఆ దేశ ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మద్దతుదారులు, నిరసనకారుల మధ్య భీకర పోరు జరిగింది.
ఇందులో ఇప్పటి దాకా పలువురు మృతి చెందారు. 250 మందికి పైగా గాయపడ్డారు. ఇదే సమయంలో అధికార పార్టీని కొట్టి చంపారు. ఇంకో ఎంపీ, మాజీ మంత్రి ఇళ్లకు నిప్పు పెట్టారు.
దీంతో కనిపిస్తే కాల్చి వేయాలంటూ రక్షణ శాఖకు శ్రీలంక దేశాధ్యక్షుడు గొటబొయి రాజపక్సే ఆదేశాలు జారీ చేశారు. భారత్ ఎప్పుడూ ఇలాంటి వాటిని ప్రోత్సహించదని స్పష్టం చేసింది
కేంద్ర సర్కార్. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు. ప్రజాస్వామ్య ప్రక్రియల ద్వారా వ్యక్తీకరించబడిన శ్రీలంక ప్రజల క్షేమం కోరుకుంటుందన్నారు.
Also Read : కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు