BCCI : శ్రీ‌లంక‌తో భార‌త్ షెడ్యూల్ మార్పు

ముందే టీ20 మ్యాచ్ ల నిర్వ‌హ‌ణ

BCCI : తాము ఆసిస్ లో ఉండ‌డం వ‌ల్ల మార్పులు చేయాల‌ని కోరుతూ శ్రీ‌లంక క్రికెట్ బోర్డు బీసీసీఐని(BCCI) విన్న‌వించింది. దీంతో వారి విన్న‌పానికి అనుగుణంగా షెడ్యూల్ లో మార్పులు చేసింది.

భార‌త్ తో ప్ర‌స్తుతం వెస్టిండీస్ ఆడుతోంది. విండీస్ టూర్ అయి పోయిన వెంట‌నే శ్రీ‌లంక భార‌త్ తో ఆడ‌బోతోంది. స‌వ‌రించిన షెడ్యూల్ ప్ర‌కారం మొద‌ట టీ20 సీరీస్ జ‌రుగుతుంది.

అది పూర్త‌యిన త‌ర్వాత రెండు టెస్టు మ్యాచ్ ల సీరీస్ చేప‌డ‌తారు. గ‌తంలో నిర్దేశించిన షెడ్యూల్ ప్ర‌కారమైతే మొద‌ట టెస్టులు నిర్వ‌హించాల్సి ఉంది. తాజాగా సీరీస్ నిర్వ‌హ‌ణ‌లో కొన్ని మార్పులు చేసిన‌ట్లు బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఇందులో భాగంగా ఈనెల 24 ను్చి 27 దాకా టీ20 సీరీస్ కొన‌సాగుతుంది. వ‌చ్చే నెల మార్చి 3 నుంచి 16 దాకా టెస్ట్ సీరీస్ నిర్వ‌హిస్తామ‌ని బీసీసీఐ(BCCI) అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఇక శ్రీ‌లంక‌తో జ‌రిగే టీ20 సీరీస్ లో మొద‌టి టీ20 ఈనెల 24న ల‌క్నో వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. అనంత‌రం జ‌రిగే రెండు టీ20 మ్యాచ్ ల‌ను ధ‌ర్మ‌శాల‌లో నిర్వ‌హిస్తారు. ఇక మొద‌టి టెస్టు మ్యాచ్ పంజాబ్ లోని మొహాలీ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది.

ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి కూడా. ఇంకో వైపు బెంగ‌ళూరు వేదిక‌గా రెండో టెస్టుకు వేదికను బీసీసీఐ బెంగ‌ళూరు ను ఖ‌రారు చేసింది. ఇప్ప‌టికే ఇక్క‌డ ఐపీఎల్ మెగా వేలాన్ని నిర్వ‌హించారు.

ఇది పూర్తిగా డే అండ్ నైట్ మ్యాచ్ గా నిర్వ‌హించేందుకు డిసైడ్ అయ్యింది బీసీసీఐ. మొత్తంగా శ్రీ‌లంక టూర్ పై క్రీడాభిమానులు ఉత్కంఠ‌తో ఉన్నారు.

Also Read : హిజాబ్ వివాదం గుత్తా జ్వాల ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!