India Slams Pakistan : పాకిస్తాన్ కామెంట్స్ భార‌త్ సీరియ‌స్

జ‌మ్మూ కాశ్మీర్ పై అన్నీ అబ‌ద్దాలే

India Slams Pakistan : పాకిస్తాన్ త‌న తీరు మార్చు కోవ‌డం లేదు. ఆ దేశానికి చెందిన ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ దేశానికి ఉగ్ర‌వాదం పెను శాపంగా మారింద‌ని. ఈ త‌రుణంలో మ‌రోసారి ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి సంస్క‌ర‌ణ‌ల అంశంపై స‌ర్వ స‌భ్య స‌మావేశం నిర్వ‌హించింది.

ఈ సంద‌ర్బంగా మ‌రోసారి పాకిస్తాన్ చిలుక ప‌లుకులు ప‌లికింది. జ‌మ్మూ కాశ్మీర్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేసేందుకు ప్ర‌య‌త్నం చేసింది. ఈ అంశాన్ని లేవ‌నెత్తింది. ఈ సంద‌ర్బంగా భార‌త దేశ ప్ర‌తినిధి తీవ్ర ఆగ్ర‌హం(India Slams Pakistan) వ్య‌క్తం చేశారు. గ‌త కొన్నేళ్లుగా పాకిస్తాన్ దీనినే ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తూ వ‌స్తోంది.

ఇది మంచి ప‌ద్ద‌తి కాదు. పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు ఎప్ప‌టి లాగే భార‌త్ పై రాళ్లు వేయాల‌ని చూస్తోంది. కానీ పాల‌నా ప‌రమైన వైఫ్యాల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకే పాకిస్తాన్ ప‌దే ప‌దే జ‌మ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్ర‌స్తావిస్తూ వ‌స్తోంద‌ని ఆరోపించారు. ఇది పూర్తిగా అసంబ‌ద్ద‌మ‌ని పేర్కొన్నారు.

ప‌దే ప‌దే అబ‌ద్దాల‌ను ప్ర‌చారం చేసినంత మాత్రాన అవి నిజాలై పోవంటూ మండిప‌డింది. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తే తాము స‌హించే ప్ర‌స‌క్తి లేద‌ని ఖ‌రాఖండిగా చెప్పేసింది భార‌త్. స‌భ సంప్ర‌దాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా పాకిస్తాన్ అనుచిత వ్యాఖ్య‌లు చేస్తోందంటూ ఆరోపించింది.

వీటిని తాము ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేసింది. పాకిస్తాన్ త‌న ప‌రిధి ఏమిటో తెలుసు కోవాల‌ని లేక‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చ‌రించింది భార‌త్.

Also Read : ఉగ్ర‌వాదం ప్ర‌పంచానికి ప్ర‌మాదం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!