India Squad Asian Games : రింకూ సింగ్ కు జట్టులో ఛాన్స్
ఆసియా క్రీడల్లో భారత్ కు రుతురాజ్ కెప్టెన్
India Squad Asian Games : హాంగ్ జౌ లో జరిగే ఆసియా క్రీడల్లో(Asian Games) ఆడే భారత జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ స్కిప్పర్ గా ఎంపికయ్యాడు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తాజాగా ఆటగాళ్లను ఎంపిక చేసింది. యూపీ కుర్రాడు రింకూ సింగ్ కు ఛాన్స్ ఇచ్చింది. శిఖర్ ధావన్ కు కెప్టెన్ గా ఛాన్స్ దక్కుతుందని అంతా భావించారు. కానీ ఊహించని రీతిలో యూపీ కుర్రాడు రింకూ సింగ్ కు అవకాశం ఇచ్చింది.
ఇదిలా ఉండగా పురుషుల క్రికెట్ పోటీ సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 8 వరకు టి20 ఫార్మాట్ లో మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ క్రీడల్లో మహిళల జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ కాగా వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన ను నియమించింది.
విచిత్రం ఏమిటంటే 2020లో న్యూజిలాండ్ లో చివరి సారిగా భారత్ జట్టు తరపున ఆడిన శివమ్ దూబేకు ఛాన్స్ ఇచ్చారు. తిలక్ వర్మ ను కూడా జట్టులోకి తీసుకుంది. ఇక టీమిండియాకు సంబంధించి చూస్తే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ కాగా యశస్వి జైస్వాల్ , తిలక్ వర్మ, రాహుల్ త్రిపాఠటి, రింకూ సింగ్ , జితేశ్ శర్మ ( వికెట్ కీపర్ ) , వాషింగ్టన్ సుందర్ , షాబాజ్ అహ్మద్ , రవి బిష్ణోయ్ , అవేష్ ఖాన్ , అర్ష్ దీప్ సింగ్ , ముఖేష్ కుమార్ , శివమ్ మావి, శివమ్ దూబే , ప్రభ సిమ్రాన్ సింగ్ ఆడతారు.
Also Read : Pawan Kalyan : ఎస్పీని కలవనున్న పవన్ కళ్యాణ్
