INDIA vs NDA : విపక్షాల కూటమి 26 పార్టీల పేరు ఇండియా
రాబోయే ఎన్నికల్లో ఇండియా వర్సెస్ ఎన్డీఏ
INDIA vs NDA : ఏమిటిది క్రికెట్ మ్యాచ్ అనుకుంటున్నారా. కానే కాదు కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోదీ , భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ (ఎన్డీఏ)కు వ్యతిరేకంగా 26 పార్టీలు కలిసి పెట్టిన పేరు ఇండియా. దీని అర్థం ఏమిటంటే భారత జాతీయ ప్రజాస్వామిక కూటమి అని. ఇప్పటికే 32 పార్టీలతో ఎన్డీఏ ఉంది.
INDIA vs NDA War
వచ్చే ఏడాది 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఇప్పటికే నిర్ణయించారు. దీనికి జీవం పోసింది, కీలక పాత్ర పోషించింది మాత్రం జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్. ఆయనకు సంపూర్ణ మద్దతు ఇచ్చింది మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్. ఓ వైపు అనారోగ్యానికి గురైనా ఎలాగైనా సరే బీజేపీకి వ్యతిరేకంగా గొంతుక కావాలని పరితపించారు.
ఇదే సమయంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) అలుపెరుగని రీతిలో కృషి చేశారు. చివరకు ఒక కొలిక్కి వచ్చింది. తొలి సమావేశం పాట్నాలో జరుగగా బెంగళూరు వేదికగా రెండో విడత కీలక భేటీ జరిగింది. చివరకు 26 పార్టీలు కలిసి ఒక ఉమ్మడి వేదికగా ఇండియా అని నామకరణం చేశాయి. ఇది ట్రెండింగ్ లో ఉంది.
Also Read : Next CM JR NTR : నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్