INDvsSA1st Odi : సఫారీ టూర్ లో భాగంగా ఇప్పటికే టెస్టు సీరీస్ కోల్పోయి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న భారత జట్టు ఇవాళ మూడు వన్డేల సీరీస్INDvsSA1st Odi) లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ ఆడనుంది.
కండరాల నొప్పి కారణంగా ఏకంగా దక్షిణాఫ్రికా టూర్ నుంచి వైదొలిగిన రోహిత్ శర్మ స్థానంలో మొదటిసారిగా కేఎల్ రాహుల్ టీమిండియా వన్డే టీంకు నాయకత్వం వహిస్తున్నాడు.
ఇక వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్టు నుంచి తప్పుకోవడంతో రాహుల్ సారథ్యంలో సఫారీ టీంతో ఓడి పోయింది. ఇక హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో భారత జట్టు చెమటోడ్చుతోంది.
ప్రత్యర్థి జట్టును తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదు. భారత్ ను ప్రధానంగా గాయాలు వేధిస్తున్నాయి. అంతే కాకుండా బ్యాటర్లు పరుగులు చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు.
ఇక 2016 తర్వాత మొదటిసారిగా కెప్టన్సీ నుంచి వైదొలిగిన స్టార్ ప్లేయర్ కోహ్లీ కేవలం ఆటగాడిగా మాత్రమే వన్డేలో ఆడనున్నాడు. ఇప్పటికే భారత్ రెండు టెస్టుల్లో ఓటమి మూటగట్టుకుంది.
ఈ తరుణంలో కేఎల్ రాహుల్ పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అన్ని ఫార్మాట్ లలో టీమిండియా బలంగా కనిపిస్తున్నప్పటికీ మ్యాచ్ వరకు వచ్చేసరికల్లా చేతులెత్తుస్తోంది. జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనేది ఉత్కంఠ నెలకొంది.
భువనేశ్వర్ కుమార్ , దీపక్ చహర్, యుజువేంద్ర చహల్ , శిఖర్ ధావన్ ఆడనున్నారు. వెంకటేశ్ అయ్యర్ కూడా వచ్చే చాన్స్(INDvsSA1st Odi) ఉంది. తుది జట్టు పరంగా చూస్తే రాహుల్, ధావన్, కోహ్లీ, సూర్య, పంత్, వెంకటేశ్, దీపక్ , భువీ, అశ్విన్, బుమ్రా, చహల్ ఆడనున్నారు.
Also Read : ధోనీ..కోహ్లీ నుంచి చాలా నేర్చుకున్నా