India Women Squad Asian Games : మహిళా క్రికెట్ టీం డిక్లేర్
ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టు
India Women Squad Asian Games : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ హాంగ్ జౌ లో జరిగే ఆసియా క్రీడల్లో(Asian Games) పాల్గొనే పురుషుల , మహిళా జట్లను ఎంపిక చేసింది. మెన్స్ టీమ్ కు కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ ను, యూపీ యువ క్రికెటర్ రింకూ సింగ్ కు ఛాన్స్ ఇచ్చింది. ఇక వీరితో పాటు మహిళా క్రికెట్ జట్టును వెల్లడించింది.
జట్టుకు స్కిప్పర్ గా పంజాబ్ కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ ను ఎంపిక చేయగా ముంబైకి చెందిన స్టార్ క్రికెటర్ స్మృతీ మందానను వైస్ కెప్టెన్ గా అవకాశం ఇచ్చింది. తాజాగా జట్టుతో పాటు స్టాండ్ బై ఆటగాళ్లను ఎంపిక చేసింది బీసీసీఐ ఎంపిక కమిటీ.
ఇక జట్టు పరంగా చూస్తే హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ కాగా స్మృతీ మంధాన వైస్ స్కిప్పర్ గా ఎంపిక చేసింది. వీరితో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ , దీప్తి శర్మ , రిచా ఘోష్ (వికెట్ కీపర్ ) , అమంజోత్ కౌర్ , దేవిక వైద్య, అంజలి సర్వాణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్ , మిన్నూజా మణి, కనికా అహూ, ఉమా ఛెత్రీ (వికెట్ కీపర్ ) , అనూషా బారెడ్డి ఆడతారు.
ఇక స్టాండ్ బై ఆటగాళ్లుగా హర్లీన్ డియోల్ , కష్వీ గౌతమ్ , స్నేహ రాణా, సైకా ఇషాక్ , పూజా వస్త్రాకర్ గా ఎంపిక చేసింది.
Also Read : India Squad Asian Games : రింకూ సింగ్ కు జట్టులో ఛాన్స్