CWG 2022 INDIA : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు 18 పతకాలు
పతకాల జాబితాలో ఇండియాకు ఏడో ప్లేస్
CWG 2022 INDIA : బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ లో భారత్ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు కడపటి సమాచారం మేరకు 18 పతకాలు సాధించింది.
ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. ఆరో రోజు భారత బృందం కిట్టికి రజతం దక్కింది.
హై జంపర్ తేజస్విన్ శంకర్ కాంస్య పతకాన్ని సాధించాడు. జూడోకా తులికా మాన్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. స్క్వాష్ స్టార్ సౌరవ్ ఘోషల్ కూడా ఇంగ్లండ్ కు చెందిన జేమ్స్ విల్ స్ట్రాప్ ను ఓడించి కాంస్య పతకం దక్కింది.
వెయిట్ లిఫ్టర్లు లవ్ ప్రీత్ సింగ్ , గుర్దీప్ సింగ్ కూడా తమ విభాగాల్లో కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. మొత్తం జాబితాలో టాప్ లో నిలిచింది ఆస్ట్రేలియా కామన్వెల్త్ గేమ్స్ లో(CWG 2022 INDIA). 46 బంగారు, 38 రజతాలు, 39 కాంస్యాలతో 123 పతకాలు సాధించింది.
ఇంగ్లండ్ 38 స్వర్ణాలు, 20 రజతాలు, 28 కాంస్యాలతో కలిపి మొత్తం 103 పతకాలు దక్కాయి. రెండో ప్లేస్ లో నిలిచింది. కెనడా 16 స్వర్ణాలు,
20 రజతాలు, 21 కాంస్య పతకాలతో 57 పతకాలతో మూడో స్థానంకు చేరుకుంది.
న్యూజిలాండ్ 16 స్వర్ణాలు 10 రజతాలు 10 కాంస్యాలతో 36 పతకాలతో నాలుగో ప్లేస్ లో నిలిచింది. స్కాట్లాండ్ 7 స్వర్ణాలు 8 రజతాలు 17 కాంస్య పతకాలతో మొత్తం 32 పతకాలు సాధించింది.
దక్షిణాఫ్రికా 6 స్వర్ణాలు 7 రజతాలు 7 కాంస్యాలతో 20 పతకాలతో 6వ స్థానంలో నిలిచింది. భారత దేశం 5 స్వర్ణాలు 4 రజతాలు 9 కాంస్యాలతో
మొత్తం 18 పతకాలు సాధించి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.
వేల్స్ 17 పతకాలు సాధించగా మలేషియా 8 పతకాలతో 8,9 స్థానాలతో నిలిచింది. ఆ తర్వాతి స్థానాలలో నైజీరియా, సైప్రస్ , ఉగండా, కెన్యా,
ఉత్తర ఐర్లాండ్ , సింగపూర్ , సమోవా దేశాలు నిలిచాయి.
జమైకా, ట్రినిడాడ్ , పాకిస్తాన్ , బెర్ముడా, కామెరూన్ , మారిషస్ , ఫిజీ, శ్రీలంక, గ్వెర్నీ, పపువా న్యూ గినియా, సెయింట్ లూసియా, టాంజానియా,
గాంబియా, నమీబియా, మాల్టా ఉన్నాయి.
Also Read : తేజస్విన్ శంకర్ కు ప్రధాని అభినందన