INDvsSA 3rd ODI : సఫారీ టూర్ లో భాగంగా కేప్ టౌన్ లో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు తాత్కాలిక స్కిప్పర్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ప్రత్యర్థి జట్టు సౌతాఫ్రికా బ్యాటింగ్ కు దిగింది.
ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికా టీం(INDvsSA 3rd ODI )ఇప్పటికే మూడు టెస్టులు సీరీస్ ను 2-1 తేడాతో చేజిక్కించుకుంది. ఇక మూడు వన్డేల సీరీస్ లో భాగంగా ఇప్పటికే ఫస్ట్ , సెకండ్ వన్డే మ్యాచ్ లలో వరుసగా ఘన విజయాన్ని నమోదు చేసింది భారత జట్టు.
ఇక ఈ ఒక్క మ్యాచ్ లోనైనా టీమిండియా గెలుపొంది పరువు పోకుండా కాపాడు కోవాలని తాజా, మాజీ ఆటగాళ్లతో పాటు కోట్లాది మంది క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా భారత జట్టు నాలుగు మార్పులతో బరిలోకి దిగింది.
ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టు కేవలం ఒకే ఒక మార్పుతో రంగంలోకి ఎంటరైంది. జయంత్ యాదవ్, ప్రసిద్ద్ కృష్ణ, దీపక్ చాహర్ , సూర్య కుమార్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకుంది.
తుది జట్ల పరంగా చూస్తే ఇలా ఉన్నాయి జట్ల వివరాలు. టీమిండియాకు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తుండగా శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ – వికెట్ కీపర్ , సూర్య కుమార్ యాదవ్ , శ్రేయాస్ అయ్యర్, జయంత్ , కృష్ణ, దీపక్ , బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు.
ఇక సౌతాఫ్రికా(INDvsSA 3rd ODI )పరంగా చూస్తే తుది జట్టు ఇలా ఉంది. క్వింటాన్ డికాక్ , మలన్ , ఎయిడెన్ మార్కరమ్ , రసీ వాన్ డెన్ డసెన్, తెంబా బవూమా – స్కిప్పర్ , మిల్లర్ , ఆండిలే, కేశవ్ మహరాజ్ , ప్రిటోరియస్, లుంగి ఎండ్వైన్ ఉన్నారు.
Also Read : చెలరేగిన భారత్ తలవంచిన ఉగండా