Indian Air Force : ఫైనల్ లో ఎయిర్ ఫోర్స్ ప్రదర్శన
అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో రెడీ
Indian Air Force : అహ్మదాబాద్ – ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఆఖరి అంకానికి చేరుకుంది. ఇప్పటి దాకా కొన్ని రోజుల పాటు అలరిస్తూ వచ్చిన టోర్నీలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ముంబై వేదికగా జరిగిన సెమీస్ లో భారత్ న్యూజిలాండ్ ను 70 రన్స్ తేడాతో ఓడించింది. ఇక కోల్ కతా వేదికగా జరిగిన కీలక పోరులో రెండో సెమీస్ లో దక్షిణాఫ్రికాను ఆసిస్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Indian Air Force will Perform in ODI World Cup
ఈ కీలకమైన పోరుకు అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం లో జరగనుంది. ఈ కీలక మ్యాచ్ కు లక్ష మందికి పైగా స్టేడియంకు రానున్నారు. ఈ మ్యాచ్ కు ప్రత్యేక ఆకర్షణగా మిగలనుంది. ఈ మేరకు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఇప్పటికే భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.
ఇదే సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force) ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టనుంది. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. భారత దేశ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటి సారి. ఇక సెమీస్ మ్యాచ్ ను ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్ల మంది వీక్షించినట్లు సమాచారం. ఇది ఓ రికార్డ్.
భారత్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ ప్రదర్శనలు ఇవ్వబోతోంది. గుజరాత్ కు చెందిన డిఫెన్స్ ప్రజా సంబంధాల అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు.
Also Read : PM Modi : వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు మోదీ