Falguni Shah Grammy : ప్రపంచంలో అత్యుత్తమ పురస్కారాలలో గ్రామీ (Grammy) అవార్డులు ముఖ్యమైనవి. తాజాగా అమెరికా (America) వేదికగా జరిగిన గ్రామీ పురస్కారాలలో ఊహించని రీతిలో భారతీయ అమెరికన్ చెందిన సింగర్ ఫల్గుణి షాకు(Falguni Shah Grammy) ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డు దక్కింది.
ఉత్తమ పిల్లల సంగీత ఆల్బమ్ కింద ఎంపిక చేసింది గ్రామీ (Grammy) అవార్డు కమిటీ. ఇదిలా ఉండగా గ్రామీలలో రెండు సార్లు ఉత్తమ పిల్లల సంగీత ఆల్బమ్ విభాగంలో నామినేట్ అయిన ఏకైక భారతీయ (India) సంతతి మహిళ ఫల్గుణి షా.
కలర్ ఫుల్ వరల్డ్ కోసం గ్రామీ అవార్డును అందుకోవడంతో యావత్ భారతం (India) సంతోషం వ్యక్తం చేసింది. కాగా ఫల్గుణి షా తన రంగస్థల పేరు ఫాలు అని పిలుస్తారు.
అవార్డు అందుకున్న తర్వాత ఆనందం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలలో తాజాగా గ్రామీ అవార్డును పొందిన ఫల్గుణి షా (Falguni Shah) తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఇవాళ ఈ సన్నివేశం వర్ణించేందుకు మాటలు రావడం లేదన్నారు. గ్రామీ ప్రిమీయర్ షోలో పాల్గొనడం జీవితంలో మరిచి పోలేనని పేర్కొన్నారు.
అద్భుతమైన ప్రతిభావంతులు, కళాకారుల మధ్య తాను గ్రామీ అవార్డు అందుకోవడం మరిచి పోలేనని తెలిపారు ఫల్గుణి షా. ఈ అద్భుతమైన గుర్తింపు కోసం తాము వినయ పూర్వకంగా రికార్డింగ్ అకాడమీకి ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని చెప్పారు.
ఫల్గుణి షా (Falguni Shah) బెస్ట్ చిల్డ్రన్స్ ఆల్బమ్ కి 123 ఆండ్రెస్ యాక్టివేట్ , ఆల్ వన్ ట్రైబ్ 1 ట్రైబ్ కలెక్టివ్ , బ్లాక్ టు ది ప్యూచర్ బై పియర్స్ ఫ్రీలాన్ , క్రేయాన్ కిడ్స్ బై లక్కీ డియాజ్ , ఫ్యామిలీ జామ్ బ్యాండ్ కి నామినేట్ గ్రామీకి నామినేట్ అయ్యాయి.
Also Read : మే 27 వరకు వెంకీ ఎఫ్3 రాదట