Indian Army Save : 500 మంది పర్యాటకుల ప్రాణాలను కాపాడిన భారత సైనికులు

అకస్మాత్తుగా కురుస్తున్న భారీ మంచు కారణంగా దాదాపు 175 కార్లు, పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారు

Indian Army : సిక్కింలో భారీగా మంచు కురుస్తోంది. అకస్మాత్తుగా కురుస్తున్న భారీ హిమపాతం వల్ల వందలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. తూర్పు సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో మంచులో చిక్కుకున్న పర్యాటకుల ప్రాణాలను భారత సైన్యానికి(Indian Army) చెందిన త్రిశక్తి కార్ప్స్ సైనికులు రక్షించారు. తూర్పు సిక్కింలోని నటులాలో బుధవారం కురిసిన భారీ మంచు కారణంగా 500 మంది పర్యాటకులు మంచులో చిక్కుకున్నారు. వారిని చూసిన ఆర్మీ జవాన్లు వెంటనే అప్రమత్తమై పర్యాటకులను రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Indian Army Save Tourists Lifes

అకస్మాత్తుగా కురుస్తున్న భారీ మంచు కారణంగా దాదాపు 175 కార్లు, పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారు. పర్యాటకులకు రక్షణ కల్పించేందుకు భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ సిద్ధంగా ఉందని మిలటరీ తెలిపింది. ఫిబ్రవరి 20న జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భారీ హిమపాతం కారణంగా నిలిచిపోయిన వాహనాలను తరలించడంలో CRPF సైనికులు సహాయం చేశారు. భారీ వర్షం మరియు మంచు కారణంగా, కొండచరియలు విరిగిపడటంతో శ్రీనగర్ మరియు జమ్మూ మధ్య జాతీయ రహదారి క్లోజ్ అయిపొయింది.

Also Read : Deputy CM Bhatti : కేసీఆర్ ప్రభుత్వం సింగరేణిని నష్టాల్లో ముంచింది

Leave A Reply

Your Email Id will not be published!