India Crime Rate : రోజుకు 86 రేప్ లు గంటకు 49 నేరాలు
భారత దేశంలో నేరాలు ఘోరాలు
India Crime Rate : భారత దేశంలో రోజు రోజుకు నేరాల సంఖ్య పెరుగుతోంది. ఆపై అత్యాచారాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. 2021లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
నేరాల చరిత్ర చూస్తే విస్తు పోవడం ఖాయం. రోజుకు 86 రేప్ లు, గంటకు మహిళలపై 49 నేరాలు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా 2020లో రేప్ కేసుల సంఖ్య 28,046 కాగా 2019లో 32 , 033గా నమోదైనట్లు ఎన్సీఆర్బీ క్రైమ్ ఇన్ ఇండియా(India Crime Rate) నివేదిక వెల్లడించింది.
ఈ సంస్థ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేస్తుంది. గత ఏడాది చూస్తే 31,677 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన సగటున చూస్తే 86 మంది అత్యాచారానికి గురవుతున్నారు.
ప్రత్యేకించి మహిళలపై నేరాలు రోజుకు 49కి పైగానే నమోదవుతుండడం గమనార్హం. రాష్ట్రాల వారీగా చూస్తే 6,337 కేసులతో రాజస్థాన్ టాప్ లో ఉంది. 2,947 కేసులతో మధ్య ప్రదేశ్ , 2,496 కేసులతో మహారాష్ట్ర, 2,845 కేసులతో ఉత్తర ప్రదేశ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఇక ఢిల్లీలో 2021 ఏడాదిలో 1,250 అత్యాచార కేసులు నమోదు కావడం విశేషం. ఇక రేప్ లకు సంబంధించిన నేరాల రేటు లక్ష జనాభకు రాజస్థాన్ లో 16.4 శాతంగా ఉంది.
చండీగఢ్ 13.3 శాతం, ఢిల్లీ 12.9 శాతం, హర్యానా 12.3 శాతం, అరుణాచల్ ప్రదేశ్ 11.1 శాతంగా నమోదయ్యాయి. ఇక దేశ వ్యాప్తంగా మహిళలపై నేరాల గురించి చూస్తే మొత్తం 4,28,278 కేసులు నమోదయ్యాయి.
నేరాల రేటు లక్ష జనాభాకు 64.5 శాతం. ఇక నేరాలకు సంబంధించి ఛార్జ్ షీట్ రేటు 77.1 శాతంగా ఉంది. 2020లో మహిళలపై నేరాల సంఖ్య 3,71,503 కాగా 2019లో 4,05,326 కేసులు నమోదయ్యాయి.
మహిళలపై జరిగిన నేరాలలో అత్యాచారం, హత్యతో కూడిన రేప్ , వరకట్నం, యాసిడ్ దాడులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, కిడ్నాప్ , బలవంతపు వివాహం,
మానవ అక్రమ రవాణా, ఆన్ లైన్ వేధింపులు వంటి నేరాలు ఉన్నాయి. 2021లో అత్యధికంగా యూపీలో 56,083, రాజస్థాన్ లో 40,738, మహారాష్ట్రలో 39,526, పశ్చిమ బెంగాల్ లో 35, 884, ఒడిశాలో 31, 352 కేసులు నమోదయ్యాయి.
Also Read : 2.7 కోట్ల పోస్ట్ లు తొలగింపు – మెటా