India Loss : ఇంగ్లండ్ అద్భుతం భారత్ ఓటమిపై ఆగ్రహం
భారత జట్టు మాజీ ఆటగాళ్లు షాకింగ్ కామెంట్స్
India Loss : ఇంగ్లండ్ వేదికగా జరిగిన రీ షెడ్యూల్, ఐదో టెస్టులో భారత జట్టుపై ఇంగ్లండ్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. భారత జట్టు నిర్దేశించిన 378 పరుగుల రికార్డు ను సులభంగా సాధించింది.
ప్రధానంగా జో రూట్ , బెయిర్ స్టో ఆకాశమే హద్దుగా చెలరేగారు. దంచి కొట్టారు. భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో ఏ ఒక్క వికెట్ నష్ట పోకుండా లక్ష్యాన్ని చేరుకున్నారు.
ఈ తరుణంలో ఫస్ట్ ఇన్నింగ్స్ తో పాటు రెండో ఇన్నింగ్స్ లో మెరిశాడు బెయిర్ స్టో. ప్రధానంగా చెప్పి మరీ కొట్టాడు. ఇక ఐదు మ్యాచ్ ల సీరీస్ ను 2-2 తో సమం చేసింది.
ఇక ఫామ్ లో ఉన్న బెయిర్ స్టో 114 రన్స్ చేస్తే రూట్ 142 పరుగులు చేశారు. నాలుగో వికెట్ కు వీరిద్దరూ ఏకంగా 269 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ సందర్భంగా భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాళ్లు ఇంగ్లండ్ విజయాన్ని అభినందించారు. ఇదే సమయంలో భారత జట్టు(India Loss) పేలవమైన ఆట తీరుపై మండిపడ్డారు. జో రూట్ , బెయిర్ స్టో కు ప్రత్యేక అభినందనలు అని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు.
ఈ విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. భారత జట్టు పూర్తిగా తేలి పోయింది ఇంగ్లండ్ ముందు అని సంచలన కామెంట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్. పుజారా, పంత్ తప్ప మిగతా వారెవరూ సత్తా చాటలేక పోయారని పేర్కొన్నాడు.
డిఫెన్స్ ఆడి ఉంటే భారత జట్టు ఓడి పోయి ఉండేది కాదన్నాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. ఓటమి తర్వాత భారత్ కాస్తా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు వీరేంద్ర సెహ్వాగ్.
Also Read : బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడి పోయాం – ద్రవిడ్