IPL Auction 2022 : ఐపీఎల్ వేలంలో మ‌నోళ్ల‌దే హ‌వా

నికోల‌స్ పూర‌న్ ఎస్ఆర్హెచ్ ప‌రం

IPL Auction 2022  : ఐపీఎల్ 2022 వేలం పాట బెంగ‌ళూరు వేదిక‌గా కొన‌సాగుతోంది. చారు శ‌ర్మ ప్ర‌స్తుతం ఆక్ష‌న‌ర్ గా ఉన్నారు. తాజాగా వేలం పాట‌లో భార‌త క్రికెట‌ర్లు (IPL Auction 2022 )దుమ్ము రేపారు. ఇషాన్ కిషాన్ టాప్ లో నిలిచాడు.

ముంబై ఇండియ‌న్స్ తీసుకుంది. ఇక ఆయా జ‌ట్లు చేజిక్కించుకున్న ఆట‌గాళ్ల వివ‌రాలు ఉన్నాయి. ధావ‌న్ ను రూ. 8.23 కోట్ల‌కు పంజాబ్ తీసుకుంది. అశ్విన్ ను రూ. 5 కోట్ల‌కు రాయ‌ల్స్ ద‌క్కించుకుంది.

పాట్ క‌మిన్స్ ను రూ. 7.25 కోట్ల‌కు కేకేఆర్ , ర‌బాడాను పంజాబ్ కింగ్స్ రూ. 9. 25 కోట్లు, బౌల్ట్ ను రాయ‌ల్స్ రూ. 8 కోట్ల‌కు , అయ్య‌ర్ ను రూ. 12. 25 కోట్ల‌కు కేకేఆర్ తీసుకుంది.

ష‌మీని గుజ‌రాత్ టైటాన్స్ రూ. 6.25 కోట్లు, డుప్లెసిస్ ను ఆర్సీబీ రూ. 7 కోట్లు, డికాక్ ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రూ. 6.75 కోట్లకు , వార్న‌ర్ ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ రూ. 6.25 కోట్లు, మ‌నీష్ పాండేను రూ. 4.60 కోట్ల‌కు ల‌క్నో సూప‌ర జెయింట్స్ ద‌క్కించుకుంది.

హెట్మెయిర్ ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రూ. 8. 50 కోట్ల‌కు , రాబిన్ ఊత‌ప్ప‌ను సీఎస్కే రూ. 2 కోట్ల‌కు తీసుకుంది. జాస‌న్ రాయ్ ను గుజ‌రాత్ టైటాన్స్ రూ. 2 కోట్లు , ప‌డిక్క‌ల్ ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రూ. 7.75 కోట్లకు (IPL Auction 2022 )చేజిక్కించుకుంది.

సురేష్ రైనా, స్టీవ్ స్మిత్ ను ఎవ‌రూ తీసుకోలేదు. డ్వేన్ బ్రావో ను సీఎస్కే రూ. 4.40 కోట్లు, నితీష్ రాణా ను కేకేఆర్ రూ. 8 కోట్లు, జాస‌న్ హోల్డ‌ర్ ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రూ. 8.75 కోట్లకు తీసుకుంది.

హ‌ర్ష‌ల్ ప‌టేల్ ను ఆర్సీబీ రూ. 10.75 కోట్ల‌కు, దీప‌క్ హూడాను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ను రూ. 5.75 కోట్లు , హ‌స‌రంగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ రూ. 10.75 కోట్లకు ద‌క్కించుకుంది.

వాషింగ్ట‌న్ సుంద‌ర్ ను స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ రూ. 8.75 కోట్లు, కృనాల్ పాండ్యా రూ. 8.25 కోట్లకు ల‌క్నో తీసుకుంది. మిచెల్ మార్ష్ ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ రూ. 6.50 కోట్ల‌కు ద‌క్కించుకుంది.

అంబ‌టి రాయుడు ను సీఎస్కే రూ. 6.75 కోట్లు, ఇషాన్ కిష‌న్ ను ముంబై ఇండియ‌న్స్ రూ. 15.25 కోట్లు, జానీ బెయిర్ స్టో పంజాబ్ కింగ్స్ రూ. 6.75 కోట్లు, దినేష్ కార్తీక్ ఆర్సీబీ రూ. 5.50 కోట్ల‌కు ద‌క్కించుకుంది. పూర‌న్ ను స‌న్ రైజ‌ర్స్ రూ. 10. 75 కోట్ల‌కు తీసుకుంది.

Also Read : ఐపీఎల్ వేలం నిర్వాహ‌కుడిగా చారు శ‌ర్మ

Leave A Reply

Your Email Id will not be published!