Anand Mahindra : భారత మహిళా శక్తి అద్భుతం – మహీంద్రా
మహిళా సాధికారతలో మనమే ఫస్ట్
Anand Mahindra : భారతీయ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. దేశానికి సంబంధించి ప్రభావితం చేసే అంశాలు, పనులు, వ్యక్తులు, విజయాలు, గెలుపులు, మలుపులు, స్పూర్తి దాయకంగా ఉండే ప్రతి ఒక్క దాని గురించి ప్రస్తావిస్తారు.
ప్రత్యేకంగా దారి గురించి షేర్ చేస్తారు. ట్విట్టర్ లో ఆనంద్ మహీంద్రా చేసే ట్వీట్లకు , పోస్ట్ లు, వీడియోలు, కామెంట్స్ కు విపరీతమైన జనాదరణ ఉంటుంది. లైక్ లు, షేర్లు, కామెంట్స్ తో హోరెత్తి పోతుంది ట్విట్టర్ లో. తాజాగా ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
ఆయన ప్రత్యేకంగా భారత దేశానికి సంబంధించిన మహిళా పైలట్ల గురించి ప్రస్తావించారు. ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మహిళా పైలట్ల సంఖ్యా పరంగా చూస్తే భారత దేశమే నెంబర్ వన్ అని పేర్కొన్నారు. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఇండియా 12.4 శాతంతో టాప్ లో ఉందని తెలిపారు.
9.9 శాతం మహిళా పైలట్లతో ఐర్లాండ్ మొత్తం లిస్టులో రెండో స్థానంలో నిలిచింది. ఇక 9.8 శాతం మహిళా పైలట్లతో దక్షిణాఫ్రికా మూడవ స్థానం దక్కించుకుంది. దీనినే ప్రత్యేకంగా గుర్తు చేశారు. మహిళా సాధికారతకు ఇది నిదర్శనమని స్పష్టం చేశారు ఆనంద్ మహీంద్రా(Anand Mahindra).
హలో వరల్డ్ ..పనిలో మహిళా శక్తి అంటే ఇదే అద్భుతమంటూ ప్రశంసలు కురిపించారు కార్పొరేట్ దిగ్గజం. ఈ ఒక్క రంగమే కాదు పలు రంగాలలో మహిళలు ప్రధానంగా రాణిస్తున్నారంటూ కొందరు పేర్కొన్నారు.
Also Read : దైవ నిర్ణయం కాదు పాలకుల పాపం