INDW vs PAKW : చెల‌రేగిన భార‌త్ త‌ల‌వంచిన పాకిస్తాన్

107 ప‌రుగుల తేడాతో అద్భుత విజ‌యం

INDW vs PAKW : న్యూజిలాండ్ వేదిక‌గా ప్రారంభ‌మైన ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ తో జ‌రిగిన తొలి మ్యాచ్ లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు(INDW vs PAKW) అద్భుత విజ‌యాన్ని సాధించింది. ఏకంగా 107 ప‌రుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.

హైద‌రాబాదీ స్టార్ ప్లేయ‌ర్ మిథాలీ రాజ్ నేతృత్వంలోని మ‌హిళా జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 244 ప‌రుగులు చేసింది. ప్ర‌త్య‌ర్థి దాయాది పాకిస్తాన్ జ‌ట్టు ముందు 245 ప‌రుగుల భారీ టార్గెట్ ముందుంచింది.

భార‌త మ‌హిళా బౌల‌ర్లు దుమ్ము రేపారు. అద్భుతంగా బౌలింగ్ చేసి పాకిస్తాన్ ను క‌ట్ట‌డి చేశారు. కేవ‌లం 137 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసి విస్తు పోయేలా చేశారు. మెగా వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీలో ఆరంభ మ్యాచ్ ను అదుర్స్ అనిపించేలా ఆడారు.

ఈ మ్యాచ్ మొత్తం అన్ని ఫార్మాట్ ల‌లో టీమిండియా ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. రాజేశ్వ‌రి గైక్వాడ్ 4 వికెట్లు తీసి స‌త్తా చాటింది. ఆమె 31 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి కీల‌క‌మైన వికెట్లు ప‌డ‌గొట్టింది.

వెట‌ర‌న్ పేస‌ర్ ఝుల‌న్ గోస్వామి రెండు వికెట్లు తీసింది. విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది. భార‌త జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో పూజా వ‌స్త్రాక‌ర్, స్నేహా రాణా పాకిస్తాన్ పై 122 ప‌రుగుల భాగస్వామ్యాన్ని నెల‌కొల్పారు.

ఈ భారీ భాగ‌స్వామ్యం పాక్ పై ఇదే రికార్డు. వ‌న్డే లో ప్ర‌పంచ చరిత్ర సృష్టించారు. ఇదిలా ఉండ‌గా మ‌హిళ‌ల ప్ర‌పంచ క‌ప్ లో భార‌త్ ఇప్ప‌టి వ‌ర‌కు 11 మ్యాచ్ లు ఆడింది పాకిస్తాన్ తో. అన్ని మ్యాచ్ లు ఇండియానే గెల‌వ‌డం విశేషం.

Also Read : భార‌త్ భ‌ళా శ్రీ‌లంక విల‌విల‌

Leave A Reply

Your Email Id will not be published!