Sarita Mor : భారత రెజ్లర్ సరిత అరుదైన ఘనత
మొదటి స్వర్ణం సాధించిన రెజ్లర్
Sarita Mor : ఆసియా ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించిన సరితా మోర్(Sarita Mor) అరుదైన ఘనతను సాధించింది. 2022 సీజన్ లో బోలాట్ తుర్గిఖఖనోవ్ కప్ లో 59 కేజీల విభాగంలో తొలి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
సరితా మోర్ మూడు బౌట్ లు ఆడింది. అజర్ బైజాన్ కు చెందిన ఝులా అలియేవాతో జరిగిన ఫైనల్ లో సత్తా చాటింది. ఈ భారతీయ మల్ల యోధురాలు సాధించిన విజయంతో క్రీడాలోకం సంతోషానికి లోనైంది.
ఆసియన్ ఛాంపియన్ షిప్ తో పోల్చినప్పుడు పోటీ స్థాయి తక్కువగా ఉందని అంగీకరిస్తున్నా. కానీ 57, 59 కిలోల విభాగంలో తప్పనిసరిగా పటీ ఉంటుందని అనుకున్నానని చెప్పింది.
57 కిలోల కంటే 59 లోనే పోటీ అధికంగా ఉందని దాని వైపు మొగ్గు చూపానని విజయం అనంతరం వ్యాఖ్యానించింది సరితా మోర్(Sarita Mor). పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడమే లక్ష్యంగా తాను ప్రయత్నం చేస్తున్నానని చెప్పింది.
ఈ సమయంలో బంగారు పతకాన్ని సాధించడం చెప్పలేని ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ విజయం మరింత బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు సరితా మోర్.
ఇదిలా ఉండగా 65 కేజీల విభాగంలో ఫైనల్ లో అజర్ బైజాన్ కు చెందిన ఎలిస్ మనోలోవాపై 8-0 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. టైటిల్ ను కైవసం చేసుకుంది.
ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఆసియా ఛాంపియన్ షిప్ లో కాంస్యం సాధించిన మనీషా కు సీనియర్ సర్క్యూట్ లో ఇది తొలి అంతర్జాతీయ స్వర్ణం.
Also Read : ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ విజేత స్వియా టెక్