INDW vs UAEW Asia Cup 2022 : యూఏఈపై భారత్ విక్టరీ
వరుసగా మూడో మ్యాచ్ లో గెలుపు
INDW vs UAEW Asia Cup 2022 : మహిళల ఆసియా కప్ 2022లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకు పోతోంది. ఇప్పటికే హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా అన్ని రంగాలలో పట్టు సాధించి గెలుపొందుతోంది. రిచ్ లీగ్ టోర్నీలో భాగంగా మూడో మ్యాచ్ లో సత్తా చాటింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుపై గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.
ఏకంగా 104 పరుగుల భారీ తేడాతో(INDW vs UAEW Asia Cup 2022) గెలుపొందింది. సిల్హెట్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో 179 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూఏఈ జట్టు తడబడింది. 1.3 ఓవర్లలోనే ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి కేవలం 5 పరుగులు చేసింది. దీంతో భారత బౌలర్లు అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు.
20 ఓవర్లలో యూఏఈ జట్టును 74 పరుగులకే కట్టడి చేశారు. దీంతో యూఏఈ టీం 4 వికెట్లు కోల్పోయింది. ఏ కోశాన టార్గెట్ ను ఛేదించేందుకు ప్రయత్నం చేయలేదు. అంతకు ముందు భారత జట్టు బ్యాటింగ్ చేసింది. 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.
ఈ తరుణంలో జెమీమా రోడ్రిగ్స్ , దీప్తి శర్మలు ఆదుకున్నారు. ఏకంగా 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాఉ. 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది నిర్ణీత 20 ఓవర్లలో. దీప్తి 49 బంతుల్లో 64 పరుగులు చేసింది. రోడ్రిగ్స్ 45 బంతులు ఆడి 75 రన్స్ తో సత్తా చాటింది. యూఏఈ తరపున ఛాయా , మహికా, ఈష్కా , సురక్షా చెరో వికెట్ తీశారు.
ఇదిలా ఉండగా ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్ లో శ్రీలంకపై గెలుపొందిన భారత్ కు ఇది వరుసగా మూడో విజయం.
Also Read : రెస్టాఫ్ ఇండియాదే ఇరానీ కప్