IndiGo CEO : ఇండిగో సిఇఓ షాకింగ్ కామెంట్స్
వివాదాస్పద వీడియోపై స్పందన
IndiGo CEO : ఇండిగో ఎయిర్ లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్ షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత దేశంలో ఇటీవల ఎయిర్ లైన్స్ లకు సంబంధించి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ప్రయాణికులు ఆయా ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లు వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నటుడు రాణా ఇండిగోపై కీలక వ్యాఖ్యలు చేశాడు. మరో వైపు ఇండిగో దేశీయ క్యారియర్ గత కొన్ని వారాలుగా అనేక వివాదాలను మూటగట్టుకుంది. ఫ్లైట్ అటెండెంట్ , ప్రయాణీకుడికి మధ్య గత నెలలో మధ్య లో వాగ్వాదం మధ్య ఇండిగో సిఇఓ(IndiGo CEO) గురువారం జాతీయ మీడియాతో మాట్లాడారు.
ప్రయాణీకులు కూడా సంయమనం పాటించాలని సూచించారు. తాము తమ సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చామన్నారు సిఇఓ. ఇరు వైపులా సర్దుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగ కూడాదన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని పేర్కొంటూనే మరో వైపు ప్రయాణీకులను ఆ తప్పును నెట్టి వేసేందుకు యత్నించడం పలు విమర్శలకు దారి తీసింది.
ఫ్లైట్ అటెండెంట్ తన పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారంటూ ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఇండిగో సంస్థ చర్యలు తీసుకోలేదని వాపోయారు. మీరు ఎలా వ్యవహరించాలని అనుకుంటున్నారో అలాగే మా సిబ్బందితో వ్యవహరించాలని సిఇఓ(IndiGo CEO) సూచించారు.
ఇదిలా ఉండగా ఇస్తాంబుల్ , ఢిల్లీ విమానంలో సిబ్బంది ఆహార ఎంపికల విషయంలో ప్రయాణికుడితో వాగ్వావాదం చోటు చేసుకుంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది.
Also Read : ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల భేటీ