Gandhasiri Vanamali : ఎవరీ ఇంద్రావతి చౌహాన్ అనుకుంటున్నారా. ఎన్నో పాటలు పాడినా రాని ప్రచారం కేవలం ఒకే ఒక్క సినిమా మూవీతో దేశాన్ని ఒక ఊపు ఊపేస్తోంది.
ప్రముఖ జానపద, సినీ గాయని మంగ్లీకి స్వంత చెల్లెలే ఈ ఇంద్రావతి చౌహాన్. ఆమె ఇటీవల రిలీజై దేశాన్ని ఊపేస్తున్న బన్నీ , రష్మిక నటించిన పుష్ప రాజ్ మూవీలో సమంత డ్యాన్సుతో దుమ్ము రేపిన ఊ అంటావా మామ ఉఊ అంటావా మామా అన్న సాంగ్ ను పాడింది ఇంద్రావతి.
ఇదే పాటను కన్నడలో మంగ్లీ ఆలాపించింది. హిందీ, మలయాళం, తమిళం లో ఇతర సింగర్స్ తో పాడించాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.
అంతకు ముందు ఇంద్రావతి చౌహాన్ ప్రధానంగా పాడి, నటించిన గంధసిరి వనమాలి(Gandhasiri Vanamali) జానపద గీతం ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. యూట్యూబ్ ను తగ్గేదేలే అంటూ దూసుకు పోతోంది.
ఇందులో మంగ్లీ కూడా నటించింది. ట్యూన్ , లిరిక్స్ సదా చంద్ర అందిస్తే ఎస్కే మదీన్ సంగీతం అందించారు ఈ సాంగ్ కు. కొరియో గ్రాఫర్ గా జాను లిరి అందించారు.
ఉదయ కుంభం ఎడిటింగ్ చేశాడు. ఈ సాంగ్ ను రాజు నిర్మించారు. ఇక అక్కా చెల్లెలు మంగ్లీ, ఇంద్రావతి చౌహాన్ తో పాటు కిరణ్మయి, పరమేశ్వరి, లహరి, అమ్ములు నటించారు.
ప్రవీణ్ జంపాల మేకప్ బాగుంది. ఎవరెస్ట్ స్టూడియో ద్వారా ఈ సాంగ్ ను రికార్డింగ్ చేశారు. వీలైతే ఈ సాంగ్ మీరు కూడా వినండి.
ఊ అంటావా పాటతో సెన్సేషన్ అయిన ఇంద్రావతి చౌహాన్ రాబోయే రోజుల్లో మరిన్ని పాటలతో దుమ్ము రేపడం ఖాయమని చెప్పక తప్పదు.
Also Read : పాలివ్వడం నేరం కాదు – ఎవలిన్ శర్మ