INDW vs ENGW T20WC : చేతులెత్తేసిన టీమిండియా
సెమీ ఫైనల్ ఆశలు సంక్లిష్టం
INDW vs ENGW T20WC : సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టి20 వరల్డ్ కప్ లో భారత జట్టు పోరాడి ఓడింది. స్మృతీ మంధాన, రిచా ఘోష్ రాణించినా విజయాన్ని అందించ లేక పోయారు. దీంతో ఇంగ్లండ్ 11 పరుగుల తేడాతో భారత జట్టును(INDW vs ENGW T20WC) ఓడించింది. నేరుగా సెమీస్ కు వెళ్లింది. ఇక హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా సెమీస్ ఆశలు మరింత సంక్లిష్టం చేసుకుంది.
ఇంగ్లండ్ వరుస విజయాలతో దూసుకు వెళ్లింది. ఈసారి మెగా టోర్నీ టైటిల్ ఫెవరేట్ జట్లుగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇరు జట్లు సత్తా చాటుతున్నాయి. ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తున్నాయి.
మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ నిర్ఱీత 20 ఓవర్లలో 151 రన్స్ చేసింది. అనంతరం 153 పరుగుల టార్గెట్ తో మైదానంలోకి దిగిన భారత జట్టు 140 పరుగులకే చాప చుట్టేసింది. పాకిస్తాన్ తో గాయం కారణంగా ఆడ లేక పోయిన స్మృతీ మంధాన వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో నిరాశ పరిచింది.
కానీ ఇంగ్లండ్ తో అద్బుతంగా రాణించింది. 41 బంతులు ఎదుర్కొని 52 రన్స్ చేసింది. ఇందులో 7 ఫోర్లు ఒక సిక్స్ ఉంంది. రిచా ఝోష్ 34 బాల్స్ ఎదుర్కొని 47 పరుగులు చేసింది. ఇందులో 4 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి.
ఓపెనర్ షెఫాలీ 11 , జెమీమా రోడ్రిగ్స్ 13 రన్స్ చేసి నిరాశ పరిచింది. హర్మన్ ప్రీత్ కౌర్ 4 రన్స్ చేస్తే దీప్తి శర్మ 7 పరుగులు చేశారు. సారా గ్లెన్ 2 వికెట్లు తీసింది. లారెన్ బెల్ , సోఫీ చెరో వికెట్ తీశారు. అంతకు ముందు ఇంగ్లండ్ జట్టులో సీవర్ 50 రన్స్ చేస్తే హీథర్ నైట్ 28 , అమీ జోన్స్ 40 పరుగులతో సత్తా చాటారు.
Also Read : ఆదుకున్న అశ్విన్ రాణించిన పటేల్