INDW vs SLW Asia Cup 2022 : ఆసియా కప్ లో భారత్ శుభారంభం
శ్రీలంక మహిళలపై జయకేతనం
INDW vs SLW Asia Cup 2022 : మహిళల ఆసియా కప్ -2022లో ప్రారంభ మ్యాచ్ లో భారత మహిళలు సత్తా చాటారు. శ్రీలంక మహిళా జట్టుపై 41 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
శ్రీలంక టాస్ గెలిచాక మొదట బ్యాటింగ్ చేసిన భారత్ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన రూపంలో వికెట్ కోల్పోయింది. మల్దా షెహానీ అద్భుతంగా క్యాచ్
పట్టడంతో పెవిలియన్ దారి పట్టింది. మరో వైపు జెమిమా రోడ్రిగ్స్ అద్భుతంగా రాణించింది. హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. భారత్ ను అగ్ర స్థానంలో నిలిపేలా చేసింది.
మహిళల టి20 ఆసియా కప్ చరిత్రలో జెమిమా రోడ్రిగ్స్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు సాధించింది.
రోడ్రిగ్స్ మైదానంలోకి వచ్చే సరికల్లా భారత జట్టు(INDW vs SLW Asia Cup 2022) క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అప్పటికే 2 వికెట్లు కోల్పోయి 21 పరుగులతో ఉంది. దీంతో ఎక్కడా తొట్రుపాటుకు లోను కాకుండా జెమిమా దంచి కొట్టింది.
శ్రీలంక మహిళా బౌలర్లకు చుక్కలు చూపించింది. మైదానం అంతటా కళ్లు చెదిరే షాట్లతో అలరించింది. కేవలం 53 బంతులు మాత్రమే ఎదుర్కొన్న
జెమిమా 11 ఫోర్లు 1 భారీ సిక్స్ తో 76 పరుగులు చేసింది.
ఆమెకు తోడుగా భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నిలిచింది. ఇద్దరూ చివరి నాలుగు ఓవర్లలో కట్టడి చేసినా భారత్ మెరుగైన స్కోర్ చేసింది. దీంతో నిర్ణీత ఓవర్లలో భారత జట్టు 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.
అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది. దయాళన్ హేమలత 15
పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది. పూజా వస్త్రాకర్ , దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టగా రాధా యాదవ్ ఒక వికెట్ తీసింది.
Also Read : బుమ్రాకు ప్రత్యామ్నాయ బౌలర్ లేడు