INDW vs SLW 2nd ODI : మెరిసిన మంధాన రాణించిన వర్మ
రెండో వన్డేలో విక్టరీ ఇండియాదే సీరీస్
INDW vs SLW 2nd ODI : పంజాబ్ కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతమైన రీతిలో రాణించింది. శ్రీలంక టూర్ లో భాగంగా ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించింది.
ఇప్పటికే మూడు టి20 మ్యాచ్ ల సీరీస్ ను భారత్ జట్టు 2-1 తేడాతో ఓడించి కైవసం చేసుకుంది. ఇక మూడు వన్డేల సీరీస్ లో భాగంగా రెండో వన్డే మ్యాచ్ లో విజయం సాధించి ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం చేసుకుంది.
మహిళల టీమ్ ఆరంభం నుంచి ఆధిపత్యం వహించారు. రెండో వన్డే(INDW vs SLW 2nd ODI) లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. భారత జట్టు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ వికెట్ పోకుండా దుమ్ము రేపారు.
కేవలం 25.4 ఓవర్లలో 174 పరుగులు చేశారు. భారత్ కు అపూర్వమైన విజయాన్ని అందించారు. స్మృతి మంధాన 83 బంతులు ఎదుర్కొని 94 పరుగులు చేసింది. నాటౌట్ గా మిగిలింది.
ఇక షెఫాలీ వర్మ మంధాన కు తోడుగా 71 పరుగులు చేసింది. ప్రత్యర్థి శ్రీలంక జట్టు భారత్ ముందు ఉంచిన 174 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.
ఇదిలా ఉండగా మంధాన, వర్మ కలిసి చేసిన ఈ పరుగులు శ్రీలంకపై భారత్ కు అన్ని వికెట్లుకు ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్. ఒక రకంగా ఇది రికార్డ్ బ్రేక్.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే హర్మన్ ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి 173 పరుగులకే కట్టడి చేశారు.
Also Read : పట్టు బిగించిన భారత్ రాణించిన పుజారా