INDW vs SLW Asia Cup Final : ఆసియా కప్ ఫైనల్ లో నువ్వా నేనా
శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక
INDW vs SLW Asia Cup Final : భారత మహిళా జట్టు ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ చేజిక్కించు కునేందుకు కేవలం అడుగు దూరంలో ఉంది. భారత జట్టు సెమీ ఫైనల్ లో థాయ్ లాండ్ ను ఓడించి ఫైనల్ కు చేరుకుంది. ఇవాళ కీలకమైన ఫైనల్ మ్యాచ్(INDW vs SLW Asia Cup Final) జరుగుతోంది. ఎవరు విజేతగా నిలుస్తారే తేలనుంది.
హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు అన్ని రంగాలలో దుమ్ము రేపుతోంది. తాజాగా అందిన సమాచారం మేరకు శ్రీలంక జట్టు కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ స్కోర్ సాధించి బలమైన భారత జట్టుపై ఒత్తిడి పెంచాలని ప్లాన్ చేసింది. ప్రస్తుతం 7వ సారి ఆసియా కప్ ను ఎవరికి దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇరు జట్లు అన్ని రకాలుగా బలంగా ఉన్నాయి. చివరి దాకా మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది. సిల్హెట్ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. భారత జట్టు పరంగా చూస్తే రాధా యాదవ్ స్థానంలో దయాళన్ హేమలతను తీసుకుంది.
భారత్ జట్టు సెమీస్ లో థాయ్ లాండ్ ను మట్టి కరిపిస్తే శ్రీలంక పాకిస్తాన్ ను 4 పరుగుల తేడాతో ఓడించింది. ఇక జట్ల పరంగా చూస్తే భారత జట్టులో షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా, హేమలత, కౌర్ , రిచా , పూజా, స్నేహ, రేణుకా, రాజేశ్వరి ఉన్నారు.
శ్రీలంక జట్టులో చమరి, అనుష్క, హర్షిత, హాసిని, నీలాక్షి, కవిషా, మల్షా, ఒషాది, సుగండిక, ఇనోకా, కుల సూర్య ఉన్నారు.
Also Read : ఇంగ్లాండ్ దే టి20 వరల్డ్ కప్ – హస్సీ