Bhagwant Mann : పంజాబ్ (Punjab) సీఎంగా అత్యంత పిన్న వయసులో ఆమ్ ఆద్మీ పార్టీకి ((Aam Aadmi Party)) చెందిన భగవంత్ మాన్ భగత్ సింగ్ (Bhagwant Mann)జన్మ స్థలం ఖట్కర్ కలాన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. అశేష జనవాహిని హర్ష ధ్వానాల మధ్య గవర్నర్ భన్వరీలాల్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు భగవంత్ మాన్(Bhagwant Mann). ఈ సందర్భంగా స్వాతంత్రం కోసం ఉరికొయ్యలను ముద్దాడిన సర్దార్ షహీద్ భగత్ సింగ్ కన్న కలలను సాకారం చేస్తానని చెప్పారు.
రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం ప్రారంభమైందని చెప్పారు. రాష్ట్రంలో ఓటు వేసిన వారే కాదు ఓటు వేయని వారు కూడా రాష్ట్ర ప్రజలేనని స్పష్టం చేశారు. ఆప్ ప్రభుత్వం (Goverment) అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని చెప్పారు.
ఇక నుంచి పాలనలో పూర్తిగా మార్పు చూస్తారని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఆప్ ఏ హామీ ఇచ్చిందో వాటిని తీర్చేందుకు ప్రయత్నం చేస్తామని ప్రకటించారు భగవంత్ మాన్.
నేను ఎవరినీ విస్మరించేందుకు లేదా విమర్శించేందుకు ఇక్కడికి రాలేదు. ఇవాళ నా జన్మ ధన్యమైందన్నారు. తాను ఆరాధించే షహీద్ భగత్ సింగ్ పుట్టిన ఊరిలో ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందన్నారు.
48 ఏళ్ల వయసు ఉన్న మాన్ 1970 తర్వాత అత్యంత పిన్న వయసు కలిగిన సీఎంగా చరిత్ర సృష్టించారు. విద్య, వైద్యం, ఉపాధి పై ఎక్కువగా ఫోకస్ పెడతామన్నారు. ఆప్ 117 సీట్లలో 92 సీట్లు గెలుపొంది చరిత్ర సృష్టించింది.
Also Read : మోదీ ఎప్పటికీ వాజ్పేయి కాలేరు