Imran Khan Necklace : ఇమ్రాన్ ఖాన్ నెక్లెస్ విక్రయంపై విచారణ
రూ. 18 కోట్లకు విక్రయించారని ఆరోపణ
Imran Khan : అవిశ్వాస తీర్మానం వీగి పోవడం, 2 ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడంతో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తన అధికార నివాసాన్ని ఖాళీ చేశారు.
మూకుమ్మడి రాజీనామా చేశారు ఆయన పార్టీకి చెందిన సభ్యులు. ఇదే సమయంలో ఆయన దేశం విడిచి వెళ్ల కూడదంటూ ఇస్లామాబాద్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.
ఈ తరుణంలో ఇమ్రాన్ ఖాన్ మాత్రం ప్రతిపక్షాలు దొంగలు అంటూ ఆరోపించారు. ఇదే సమయంలో పాకిస్తాన్ దేశానికి మూడుసార్లు ప్రధానిగా పని చేసిన నవాజ్ షరీఫ్ తమ్ముడైన షెహబాజ్ షరీఫ్ ఇప్పుడు ప్రధానమంత్రిగా కొలువు తీరారు.
దీంతో ఇమ్రాన్ ఖాన్ ను టార్గెట్ చేయడం మొదలైంది కొత్త ప్రభుత్వం. ఈ తరుణంలో ప్రధానిగా ఉన్న సమయంలో ఇమ్రాన్ ఖాన్(Imran Khan) కు బహుమతిగా నెక్లెస్ ను ఇచ్చారు.
దీనిని తోషా – ఖానా అంటే స్టేట్ గిఫ్ట్ రిపోజిటరీకి పంపించ లేదని, మాజీ స్పెషల్ అసిస్టెంట్ జుల్ఫికర్ బుఖారీ దానిని లాహోర్ లోని నగల వ్యాపారికి రూ. 18 కోట్లకు విక్రయించారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ నెక్లెస్ విక్రయంపై విచారణ ప్రారంభమైంది. ఆ దేశ రూల్స్ ప్రకారం ప్రధానికి కానీ లేదా ఎవరైనా పదవుల్లో ఉన్న వారికి గిఫ్టుల రూపంలో వచ్చిన వాటిని తోషా ఖానాలో చట్ట బద్దంగా సమర్పించాల్సి ఉంటుంది.
కానీ ఇమ్రాన్ ఖాన్ కు వచ్చిన గిఫ్ట్ నెక్లెస్ ను సమర్పించక పోవడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. దీనికి సంబంధించి పాకిస్తాన్ కు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది.
Also Read : ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపాలి