Heeraben Modi Journey : నిత్య పాఠం హీరా బెన్ జీవితం
పాత్రలు కడిగింది పిల్లల్ని పెంచింది
Heeraben Modi Journey : చిన్న తనంలో తల్లిని కోల్పోయింది. త్వరగా పెళ్లి కావడంతో పిల్లల బాధ్యతను తానే భుజానికి ఎత్తుకుంది. ఇంటి ఖర్చుల కోసం ఇళ్లల్లో పాత్రలు కడిగింది. కుటుంబాన్ని నెట్టుకు వచ్చింది. 99 ఏళ్లు పూర్తయి వందేళ్లలోకి చేరినా తుది శ్వాస విడిచేంత వరకు తన పనుల్ని తానే చేసుకున్న నిజమైన కర్మ యోగి హీరా బెన్ మోదీ.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఈ దేశానికి అందించిన ఘనత కూడా ఆమెదే. ఆమె(Heeraben Modi Journey) ఎవరిపై ఆధార పడకుండా తనంతకు తానుగా ప్రయాణం చేశారు. జీవితాంతం కష్ట పడుతూనే ఉన్నారు. సోమరితనం అన్నది శరీరానికి మంచిది కాదన్నది ఆమె అభిప్రాయం. పిల్లలకు కూడా సంస్కారం, విలువలు, శ్రమించే తత్వాన్ని నేర్పారు.
అందుకే ఇవాళ హీరా బెన్ ను ఆదర్శ ప్రాయమైన మహిళగా గుర్తు చేసుకుంటున్నారు. తన తల్లిని కోల్పోయిన మోదీ కన్నీటి పర్యంతమయ్యారు. తమ కోసం తన జీవితాన్ని ధార పోశారని గుర్తు చేసుకున్నారు. తనను , తోబుట్టువులను పెంచేందుకు పొరుగున ఉన్న ఇళ్లల్లో పాత్రలను చేసిందని వాపోయారు.
ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక అద్భుతమైన శతాబ్దం దేవుని పాదాల వద్ద ఉంది అని తల్లి గురించి పేర్కొన్నారు మోదీ. ఇది అక్షరాల వాస్తవం కూడా. హీరా బెన్ గురించి ఎక్కువగా తెలియదు. కానీ ప్రధాన మంత్రి పదే పదే ఆమె గురించి ప్రస్తావిస్తూ వచ్చారు.
ఆమె జూన్ 18, 1922లో గుజరాత్ లోని మెహసానాలో పుట్టారు. వాద్ నగర్ లో టీ అమ్మే వ్యక్తి దామోదర దాస్ మూల్ చంద్ మోడీతో చిన్న వయస్సు లోనే హీరా బెన్ కు పెళ్లి జరిగింది. ఐదుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. వారిలో అమృత్ మోడీ, పంకజ్ మోడీ, నరేంద్ర మోడీ, ప్రహ్లాద్ మోడీ, సోమ మోడీ. కూతురు వాసంతి బెన్ హన్స్ ముఖ్ లాల్ మోడీ. తాజాగా గుజరాత్ లో జరిగిన ఎన్నికల్లో హీరా బెన్ తన ఓటు వేశారు.
చివరి దాకా ఆమె చురుకుగానే ఉన్నారు. ఇది అందరినీ విస్తు పోయేలా చేసింది. తనపై తల్లి ప్రభావం ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు మోదీ. నా తల్లితో పాటు దేశంలోని తల్లులంతా తమ పిల్లల కోసం ఎంతో విలువైన జీవితాలను త్యాగం చేస్తారని పేర్కొన్నారు ప్రధానమంత్రి ఫేస్ బుక్ సిఇఓ జుకెర్ బర్గ్ తో మాట్లాడిన సందర్భంలో. పేదరికాన్ని చూసిన తన తల్లి గురించి వచ్చిందే గరీబ్ కళ్యాణ్ యోజన. ఏది ఏమైనా హీరా బెన్ నిజమైన కర్మ యోగి అని చెప్పక తప్పదు.
Also Read : హీరా బెన్ మరణం బాధాకరం
This Video Made Me Very Emotional, Om Shanti #HeerabenModi pic.twitter.com/JscLqcN1K0
— Narendra Modi fan (@narendramodi177) December 30, 2022