International Tea Day : బతుకు పండాలంటే టీ తాగాల్సిందే
మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవం
International Tea Day : మనసు బాగో లేనప్పుడు, గుండె మండుతున్నప్పుడు, ఆలోచనలు అస్తవ్యస్తంగా మారి నప్పుడు, తలంతా బరువుగా తోచినప్పుడు వెంటనే గుర్తుకు వచ్చేది టీ (చాయ్). తెలంగాణలో దానిని చాయ్ అంటారు.
ఇవాళ అంతర్జాతీయ టీ దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది నిత్యం తాగే పానియం టీ. వందల రకాలలో ఇప్పుడు లభిస్తోంది చాయ్.
మనోళ్లు ఎక్కువగా టీని చాయ్ గా పిలుస్తారు.
ఇక ఇండియాలో మోస్ట్ ఫెవరబుల్ పానియాలలో టీ టాప్ లో ఉంది. విదేశాలలో కాఫీ తన సత్తా చాటినా టీ మాత్రం దుమ్ము రేపుతోంది.
అల్లం, మసాలా, గులాబీ, ఇలా వందల రకాలలో టీ లభిస్తోంది.
ఏ హోటల్ కు వెళ్లినా ముందుగా పలుకరించేది మాత్రం టీనే. ఎందుకంటే అది తాగితే ఎక్కడ లేనంతటి ఉత్సాహం కలుగుతుంది. కోల్పోయిన జోష్ తిరిగి తెచ్చేలా చేస్తుంది.
భారత్ లో ఇరానీ చాయ్ కి ఉన్నంత డిమాండ్ ఇంకేదానికి లేదంటే నమ్మలేం. ఒక్క టీ తయారీతో కోట్లాది రూపాయలు సంపాదించిన వాళ్లు ఎందరో ఉన్నారు.
ఇక టీ విషయానికి వస్తే భారత్ ను పాలించిన ఆంగ్లేయులు మొదటగా టీని పరిచయం చేశారు. ఆ తర్వాత అది కోట్లాది భారతీయులకు నిత్యం వ్యసనంగా మారింది.
అది లేక పోతే, దానిని తాగక పోతే ఉండలేని స్థితికి చేరుకున్నారు. సామాన్యుల నుంచి ధనవంతుల దాకా ప్రతి ఒక్కరు ఛాయ్ లవర్సే. ఒక్క టీ పొడితో కంపెనీలు వందల కోట్లు వెనకేసుకు వస్తున్నాయి.
తేయాకుల తయారీలో టాప్ లో ఉంది శ్రీలంక, ఇండియా, ఇతర దేశాలు కూడా. అంతెందుకు భారత దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నత స్థానంలో ఉన్న నరేంద్ర దామోదర దాస్ మోదీ కూడా ఒకప్పుడు టీ అమ్మిన వ్యక్తే. ఆయనే తనను తాను ఛాయ్ వాలాగా పరిచయం చేసుకుంటారు.
కూలీలు, కార్మికులు, సామాన్యులు, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేది టీనే. అది లేక పోతే లైఫ్ లేదు బాస్ అంటారు కవులు, కళాకారులు, రచయితలు, పేరొందిన మేధావులు.
ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం 2019 డిసెంబర్ 21న ప్రతి ఏటా మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది ప్రపంచం.
టీ తాగడం, తయారీ చేయడం పక్కన పెడితే అది ఆయా దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో, సాంస్కృతికంగా దగ్గర చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఇదిలా ఉండగా ఇండియా, శ్రీలంక, వియత్నాం, నేపాల్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, కెన్యా, మలావి, మలేషియా, ఉగాండా, టాంజానియాలలో అత్యధికంగా టీని ఉత్పత్తి చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా అధికారికంగా 2005 డిసెంబర్ 15 నుంచి ఇంటర్నేషనల్ టీ(International Tea Day) ని జరుపుకుంటున్నాం.
Also Read : అలుపెరుగని పోరాటం అమ్మకు వందనం