IPL 2022 Qualifier1 : గుజ‌రాత్ రాజ‌స్తాన్ నువ్వా నేనా

క్వాలిఫ‌య‌ర్ -1 పోటీకి రెడీ

IPL 2022 Qualifier1 : మొద‌టిసారిగా ఐపీఎల్ లో అడుగు పెట్టి విస్తు పోయేలా చేసిన గుజ‌రాత్ టైటాన్స్ తో అడ‌పా ద‌డపా గెలుస్తూ ప్లే ఆఫ్స్ కు చేరుకున్న రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఐపీఎల్ క్వాలిఫ‌య‌ర్ -1(IPL 2022 Qualifier1) లో త‌ల‌ప‌డుతోంది.

టైటిల్ వేట‌లో ఇరు జ‌ట్లు నువ్వా నేనా అన్న రీత‌లో ఆడ‌నున్నాయి. ఇక ఇప్ప‌టికే నాలుగు జ‌ట్లు చేరుకున్నాయి. ఫ‌స్ట్ ప్లేస్ లో గుజ‌రాత్ , రెండో స్థానంలో రాజ‌స్తాన్ , మూడో ప్లేస్ లో ల‌క్నో, నాలుగో స్థానంలో బెంగళూరు ఉన్నాయి.

ఇవాళ జ‌రిగే మ్యాచ్ అత్యంత కీల‌కం ఇరు జ‌ట్ల‌కు. రెండు నెల‌ల పాటు అల‌రిస్తూ వ‌చ్చిన ఐపీఎల్(IPL 2022 Qualifier1) 2022 ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈనెల 29న అహ్మ‌దాబాద్ లో ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. రూ. 20 కోట్ల ప్రైజ్ మ‌నీ ద‌క్క‌నుంది విజేత‌కు.

ఇక ఇరు జ‌ట్లు చూస్తే బ‌లంగా ఉన్నాయి. కానీ ఏ జ‌ట్టు గెలుస్తుందో ఈ పొట్టి ఫార్మాట్ లో చెప్ప‌లేం. బంతికి బ్యాట్ కు మ‌ధ్య జ‌రిగే పోరులో అంతిమ విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుందో అంచ‌నా వేయ‌డం క‌ష్టం.

ఈ 15వ సీజ‌న్ లో తొలి పైన‌లిస్ట్ ఎవ‌ర‌నేది తేలి పోనుంది. ఇవాళ జ‌రిగే మ్యాచ్ లో విజ‌యం సాధించిన జ‌ట్టు ఆదివారం జ‌రిగే ఫైన‌ల్ కు నేరుగా వెళుతుంది. ఇక ఓడిన జ‌ట్టుకు ఇంకో చాన్స్ ఉంటుంది.

ఎలాంటి అంచ‌నాలు లేకుండానే అడుగు పెట్టిన రాజ‌స్థాన్ గుజ‌రాత్ కు షాక్ ఇవ్వాల‌ని అనుకుంటోంది. ఇక జైత్ర‌యాత్ర చేస్తున్న గుజ‌రాత్ ఛాన్స్ ఇవ్వ‌కుండానే క‌థ ముగించాల‌ని చూస్తోంది.

Also Read : ఐపీఎల్ అవార్డులు ద‌క్కేదెవ‌రికో

Leave A Reply

Your Email Id will not be published!