IPL 2022 : భారత్ అంటేనే క్రికెట్. క్రికెట్ అంటేనే ఈ దేశంలో ఓ మతం కంటే ఎక్కువ. ఈ దేశంలో పొలిటికల్ లీడర్స్ కంటే ఎక్కువ పాపులారిటి కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే వారు క్రికెటర్లు మాత్రమే.
ఆ తర్వాతే సినీ రంగానికి చెందిన నటీ నటులు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022)అంటేనే ఎనలేని జోష్ వస్తుంది క్రీడాభిమానులకు.
బంతికి బ్యాట్ కు మధ్య జరిగే ఉత్కంఠ భరిత పోరాటంలో ఏ ప్లేయర్ ఎప్పుడు షైన్ అవుతారనేది చెప్పడం కష్టం.
ఇదిలా ఉండగా ఈసారి ఐపీఎల్ లో కొత్తగా రెండు జట్లను చేర్చింది భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ.
అంతే కాదు ఈ ఏడాది నుంచి ఐపీఎల్ స్పాన్సర్ కు మారారు.
ఐపీఎల్ వివో నుంచి భారత్ కు చెందిన దిగ్గజ కంపెనీ టాటా కైవసం చేసుకుంది. దీంతో 2022 ఐపీఎల్ టాటా (IPL 2022పేరుతో వస్తుందన్నమాట.
కరోనా కేసుల ప్రభావం తో గత ఏడాది యూఏఈ వేదికగా బీసీసీఐ ఐపీఎల్ 2021 ను నిర్వహించింది.
ఈసారి కూడా కరోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో మరోసారి తటస్థ వేదికగా నిర్వహించే ఆలోచన లేక పోలేదని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
తాజగా బీసీసీఐ ఎలాంటి క్రౌడ్ లేకుండానే భారత్ లోనే ఐపీఎల్ 2022 నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని అధికారికంగా పేరు చెప్పని ఓ అధికారి ద్వారా అందిన సమాచారం మాత్రమే.
కాగా గత ఐపీఎల్ లో 8 జట్లు ఆడగా ఈసారి రెండు జట్లు అదనంగా వచ్చాయి. ఒకటి అహ్మదాబాద్ కాగా రెండోది లక్నో.
ఒకవేళ కోవిడ్ పరిస్థితులు కంట్రోల్ లోకి వస్తే ఇండియాలోనే ఐపీఎల్ నిర్వహించాలని నిర్ణయించింది బీసీసీఐ.
ఐపీఎల్ నిర్వహణ కోసం ఇప్పటికే మైదానాలు కూడా ఖరారు చేసింది. ముంబైలోని మూడు స్టేడియాలు ఎంపిక చేసింది.
ఇదిలా ఉండగా ఐపీఎల్ 2022 (IPL 2022)కోసం ఈనెల 20తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది.
మొత్తం 1, 214 మంది ఆటగాళ్లు సంతకం చేశారు. వీరిలో 896 మంది భారత ప్లేయర్లు ఉంటే 318 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
రెండు రోజుల మెగా వేలంలో ప్రపంచ క్రికెట్ లోని అత్యుత్తమ ప్రతిభావంతుల కోసం 10 జట్లు వేలం వేయనున్నాయి.
Also Read : షోకాజ్ నోటీసుపై దాదా కామెంట్