IPL 2023 Awards : ఐపీఎల్ లో అవార్డులు విజేత‌లు

ముగిసిన పొట్టి ఫార్మాట్ ప‌ర్వం

IPL 2023 Awards : ఐపీఎల్ 16వ సీజ‌న్ 2023 ముగిసింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ విజేత‌గా నిలిచింది. ర‌న్న‌ర‌ప్ గా గుజ‌రాత్ టైటాన్స్ ప‌రిమిత‌మైంది. అవార్డుల ప‌రంగా చూస్తే గుజ‌రాత్ టైటాన్స్ ప్లేయ‌ర్ల‌కు భారీగా ద‌క్కాయి. ఈ సీజ‌న్ లో అత్యుత్త‌మ బ్యాట‌ర్ల‌లో గుజ‌రాత్ టైటాన్స్ కు చెందిన శుభ్ మ‌న్ గిల్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చెందిన య‌శ‌స్వి జైస్వాల్ నిలిచారు. ఆరెంజ్ క్యాప్ గిల్ కు ద‌క్క‌గా మ‌హ్మ‌ద్ ష‌మీకి ప‌ర్పుల్ క్యాప్ ద‌క్కింది. అయినా గుజ‌రాత్ టైటాన్స్ విజేత కాలేక పోయింది.

ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ బాడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. టైటిల్ సీఎస్కే పొంద‌గా , త‌ర్వాతి స్థానాల్లో గుజ‌రాత్ , ముంబై , ల‌క్నో నిలిచాయి. ఈ సీజ‌న్ లో అత్యుత్త‌మ ఆట‌కు వేదిక‌లుగా కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ , ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలు నిలిచాయి. ఇక ప్ర‌తి ఏటా ఇచ్చే ఐపీఎల్(IPL) ఫెయిర్ ప్లే అవార్డు ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు ద‌క్కింది. అత్యధిక వ్య‌క్తిగ‌త ప‌రుగుల జాబితాలో 890 ప‌రుగులు చేసిన శుభ్ మ‌న్ గిల్ నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ ద‌క్కింది. అత్య‌ధిక వ్య‌క్తిగ‌త వికెట్లు తీసిన బౌల‌ర్ల‌లో ష‌మీకి ప‌ర్పుల్ క్యాప్ ద‌క్కింది. మొత్తం 28 వికెట్లు తీశాడు.

ఇక సూప‌ర్ స్క్రైక‌ర్ ఆఫ్ ది టోర్నీగా గ్లెన్ మ్యాక్స్ వెల్ నిలిచాడు. గేమ్ ఛేంజ‌ర్ గా శుభ్ మ‌న్ గిల్ , అత్యంత విలువైన ఆట‌గాడిగా ఎంపిక‌య్యాడు. అత్య‌ధిక ఫోర్లు కొట్టిన ప్లేయ‌ర్ గా కూడా అత‌డికే ద‌క్కింది. అత్యంత భారీ సిక్స‌ర్ న‌మోదు చేసిన ఆట‌డిగా అవార్డు ను ఫ్లాఫ్ డు ప్లెసిస్ ఎంపిక‌య్యాడు. అత‌డు 115 మీట‌ర్ల దూరంలో సిక్స్ బాదాడు. క్యాచ్ ఆఫ్ ది టోర్నీగా ర‌షీద్ ఖాన్ , ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్ ఆఫ్ ది సీజ‌న్ గా య‌శ‌స్వి జైస్వాల్ ఎంపిక‌య్యాడు.

Also Read : MS Dhoni Celebrate

 

Leave A Reply

Your Email Id will not be published!