IPL 2024 : ఐపీఎల్ 2024లో ఒక ప్రత్యేక రికార్డును సాధించిన దినేష్ కార్తీక్

అతని కంటే ముందు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు....

IPL 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది. ఈ జట్టులోని అత్యుత్తమ ఆటగాళ్లలో దినేష్ కార్తీక్ ఒకరు. జట్టు ఎంత విఫలమైనా డీకే అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. మరోవైపు, అతను అద్భుతమైన వికెట్ కీపర్ కూడా. అతని ఫామ్ దృష్ట్యా అతనికి టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం కల్పించాలనే చర్చ కూడా సాగుతోంది. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్‌లో దినేష్ కార్తీక్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.

IPL 2024 Dinesh Karthik Records

ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా కార్తీక్ అరుదైన రికార్డు సృష్టించాడు. అతని కంటే ముందు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. ధోనీ, రోహిత్ ఇద్దరూ ఐపీఎల్‌లో 250కి పైగా మ్యాచ్‌లు ఆడారు. కార్తీక్ తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలకు ఆడాడు. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తొలిసారి ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత కింగ్స్ పంజాబ్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు.

Also Read : IPL 2024 KKR vs RCB : బ్లాక్ బస్టర్ బ్యాటింగ్ తో ఆర్సీబీకి భారీ టార్గెట్ ఇచ్చిన కోల్ కతా

Leave A Reply

Your Email Id will not be published!