IPL All Time Records : ఐపీఎల్ టోర్నీ ఆల్-టైమ్ రికార్డులు ఇవే..

IPL All Time Records : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన T20 లీగ్‌. ఏళ్ల తరబడి ఈ లీగ్ క్రికెటర్ల అదృష్టాన్ని.. అలాగే వివిధ దేశాలలో క్రికెట్ ఆడే విధానాన్ని ప్రభావితం చేసింది.

ఈ లీగ్‌లో.. ఆటగాళ్ళు తమ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని పొందుతారు. ఇప్పటి వరకు ఈ లీగ్‌లో ఎన్నో రికార్డులు బద్దలు (IPL All Time Records) అయ్యాయి. ఇక, ఐపీఎల్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డుల గురించి తెలుసుకుందాం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) సీజన్ మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పాత ఫార్మాట్ లోకి వచ్చింది. ఐపీఎల్ 2023 హోమ్ మరియు ఎవే ఫార్మాట్‌లో ఆడబడుతుంది.

అంటే, అన్ని జట్లు తమ సొంత మైదానంలో మరియు ఇతర జట్ల హోమ్ గ్రౌండ్‌లో ఒకదానితో ఒకటి తలపడతాయి. ఐపీఎల్ 2023 సీజన్ మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభం కానుంది.  డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జెయింట్స్ , నాలుగుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. 

ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు..టోర్నమెంట్ యొక్క ఆల్ టైమ్ రికార్డులపై ఓ లుక్కేద్దాం. అత్యధిక పరుగులు : 6624 పరుగులతో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఐపిఎల్ చరిత్రలో ఆల్ టైమ్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 223 మ్యాచ్‌లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ 129.14 స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు.

కోహ్లీ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఐదు సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు చేశాడు. ఐపీఎల్‌లో వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో 183 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. డ్వేన్ బ్రావో ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 161 మ్యాచ్‌లు ఆడాడు.

బ్రావో ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్ జట్లలో భాగంగా ఉన్నాడు. అయితే, డ్వేన్ బ్రావో ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వికెట్ కీపర్ ఔట్స్: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్‌గా అవతరించాడు. ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 170 వికెట్లు పడగొట్టాడు.

క్యాచ్‌లు: ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన క్రికెటర్ల జాబితాలో భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అగ్రస్థానంలో నిలిచాడు. టోర్నీ చరిత్రలో ఓవరాల్‌గా సురేశ్ రైనా 109 క్యాచ్‌లు అందుకున్నాడు.

అత్యధిక మ్యాచ్‌లు: మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డును కలిగి ఉన్నాడు. దేశవాళీ టీ20 టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఇప్పటివరకు 234 మ్యాచ్‌లు ఆడాడు.

సెంచరీలు: ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ యూనివర్శల్ బాస్ క్రిస్ గేల్. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ కోల్‌కతా నైట్ రైడర్స్,

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడిన 13 సీజన్లలో 141 ఇన్నింగ్స్‌లలో ఆరు సెంచరీలు సాధించాడు.

హాఫ్ సెంచరీలు: ఈ జాబితాలో ఆస్ట్రేలియా డేంజరస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. వార్నర్ 162 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 59 హాఫ్ సెంచరీలు

సాధించాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచారు.

అత్యధిక సిక్సర్లు: ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ‘యూనివర్స్ బాస్’ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు క్రిస్ గేల్ 357 సిక్సర్లు కొట్టాడు. 251 సిక్సర్లతో ఏబీ డివిలియర్స్ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 240 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

అత్యధిక ఫోర్లు: ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో శిఖర్ ధావన్ 701 ఫోర్లు కొట్టాడు. 

ఈ జాబితాలో 578 ఫోర్లతో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో(IPL All Time Records) నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో ఉన్నాడు. 

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 561 ఫోర్లు బాదాడు డేవిడ్ బాయ్.

Also Read : ఫినిషింగ్ లో ఎంఎస్ ధోనీ కి ఎవరు సరిరారు : రియాన్ పరాగ్

Leave A Reply

Your Email Id will not be published!