IPL Auction 2024 : ఐపీఎల్ వేలానికి వేళాయె
డిసెంబర్ 19న ముహూర్తం
IPL Auction 2024 : దుబాయ్ – ప్రపంచ క్రికెట్ లో అత్యంత జనాదరణ కలిగిన టోర్నీ ఏదైనా ఉందంటే అది బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించే ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్). దీనికి భారీ ఎత్తున ఆదరణ లభించింది. దీంతో ద్వితీయ శ్రేణి క్రికెటర్లకు ఊహించని ఆఫర్లు వచ్చాయి. ఈ టోర్నీకి వచ్చినంత క్రేజ్ ఇంకే ఏ ఫార్మాట్ కు రాలేదు.
IPL Auction 2024 Updates
వచ్చే ఏడాది 2024లో ఐపీఎల్(IPL) జరగనుంది. ఇందులో భాగంగా మినీ వేలం పాటకు సిద్దమైంది. ఇప్పటికే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ప్రతి ఏటా భారత దేశంలో నిర్వహించే వారు. కానీ ఈసారి ఊహించని రీతిలో దుబాయ్ లో మినీ వేలం పాట నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. డిసెంబర్ 19న ఐపీఎల్ వేలం పాటకు శ్రీకారం చుట్టింది. ఆరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి స్టార్ట్ కానుంది. ఇదిలా ఉండగా ఈసారి వేలం పాటలో 333 మంది ఆటగాళ్లను లిస్టు చేసింది. టోర్నీ పరంగా చూస్తే ఫ్రాంచైజీలు 10కి సంబంధించి 77 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయని బీసీసీఐ స్పష్టం చేసింది. మొత్తం ఆటగాళ్లలో 77 మంది వేలం పాటలోకి రానున్నారు. వీరిలో 30 మంది విదేశీ ఆటగాళ్లు ఉండడం విశేషం.
Also Read : BCCI Invites : ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ ఎవరో